రాయలసీమ జిల్లాల యంగ్ కమ్యూనిస్టు సదస్సును జయప్రదం చేయండి...గండల సంతోష్ కుమార్,ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి...
రాయలసీమ జిల్లాల యంగ్ కమ్యూనిస్టు సదస్సునుజయప్రదం చేయండిగండల సంతోష్ కుమార్,ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి
కర్నూలు నగరంలో డిసెంబర్,19వ తేదీన జరిగే రాయలసీమ జిల్లాల యంగ్ కమ్యూ నిస్టు సదస్సును జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గండల సం తోష్ కుమార్ పిలుపునిచ్చారు.శనివారం నాడు స్థానిక సిఆర్ భవన్ నందు ఏఐవైఎఫ్ రా యలసీమ జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల సమావేశం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు అధ్యక్ష తన జరిగింది.ఈ సందర్బంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం నుండి దేశానికి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని,కేంద్ర మంత్రులను,ముఖ్యమంత్రులను అందిం చినప్పటికీ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ఈ జిల్లాలోని యువత ఉన్నత చదువులు చదివి ఉపాధి కోసం బెంగళూరు ముంబై చెన్నై ఢిల్లీ వంటి ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశా లు కల్పించే పరిశ్రమలు సాధించకపోవడం పాలకుల నిర్లక్ష్యమన్నారు.ఈ జిల్లాలో ని త్యం కరువు నిలయం అవుతున్నాయని, తక్కువ ఖర్చులతో పూర్తయ్య ప్రాజెక్టుల పైన కూ డా పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎడారిగా మారి ప్రమాదం ఏర్పడిందన్నారు.విభజన హామీలలో భాగమైన కడప స్టీల్ ప్లాంట్ గురించి ప్రభుత్వాలు మారుతా ఉన్న శంకుస్థాపనలకే పరి మితమయ్యాయి తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పెట్టడం లేదని ఆయన విమర్శిం చారు.2024 ఎన్నికలకు ముందు నారా చంద్రబాబునాయుడు నూతన పరిశ్రమలు తీసు కొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చి అధికారం చేపట్టి రెండు సం వత్సరాలు గడుస్తా ఉన్న ఇప్పటివరకు ప్రకటనలకే పరిమితమయ్యారు తప్ప యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కావున రాయలసీమ యువతకు జరుగుతున్న అన్యా యాల పట్ల పాలకుల నిర్లక్ష్యం పట్ల యువతలో చైతన్యం కలిగించి ఉపాధి హక్కును సా ధించడం కోసం డిసెంబర్ నెల 19 వ తేదీన యంగ్ కమ్యూనిస్టు పేరుతో కర్నూల్ లో సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఈ సదస్సుకు ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షులు రోషన్ కుమార్,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గారు పాల్గొంటున్నారని ఈ స దస్సులో రాయలసీమలో నూతన పరిశ్రమల స్థాపన కోసం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సమర శీల పోరాటాలు సాగించడానికి వేదిక కానంది కావున ఈ సదస్సు కూడా రాయలసీమ జిల్లాల నుండి అధిక సంఖ్యలో ఏఐవైఎఫ్ నాయకులు కార్యకర్తలు నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి నక్కీ లెనిన్ బాబు,రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగరాముడు,తిరుపతి జిల్లా కార్యదర్శి రామకృష్ణ,అన్నమయ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్ వెంకటేశు,కడప జి ల్లా అధ్యక్షులు ప్రభాకర్,నంద్యాల జిల్లా అధ్యక్షులు రణత్,కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీరా ములు,జిల్లా ఆఫీస్ బేరర్స్ బిసన్న,రమేష్,రాజు,రాజీవ్,నాగరాజు పాల్గొన్నారు.
Comments
Post a Comment