నగరపాలక మేనేజర్‌కు అరుదైన గౌరవంప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం...ఆంధ్ర సారస్వత సేవా పురస్కారం ప్రకటింపు...
నగరపాలక మేనేజర్‌కు అరుదైన గౌరవంప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానంఆంధ్ర సారస్వత సేవా పురస్కారం ప్రకటింపు
కర్నూలు నగరపాలక సంస్థ మేనేజర్ యన్.చిన్నరాముడుకు అరుదైన గౌరవం లభించిం ది.వచ్చే ఏడాది జనవరి 3,4,5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యం లో జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు అతిథిగా హాజరు కావాలని ఆహ్వాని స్తూ పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్,మహాసభల ప్రధాన సమన్వయకర్త పి.రామ చంద్రలు అధికారిక ఆహ్వాన పత్రాన్ని పంపించారు.లేఖలో యన్.చిన్నరాముడు నగర పా లక సంస్థలో తెలుగు భాషా ప్రచారం,వికాసానికి అంకితభా వంతో అందిస్తున్న విశిష్ట సే వలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయని,తెలుగు భాషాభిమానానికి ఆయన చూపుతున్న నిబద్ధత అనేక మందికి స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు.మహాసభల ప్రధా న కార్యక్రమంలో ఆయనకు“ఆంధ్ర సారస్వత సేవా పురస్కారం”ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment