సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు...

సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు
హైకోర్టును కోరిన సీబీఐ
జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఐఏఎస్ శ్రీలక్ష్మి
విచారణలోనే నేరం రుజువవుతుందని సీబీఐ వాదన
పాత నేరానికి కొత్త చట్టం కింద అనుమతి చెల్లదన్న 
శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది
తదుపరి విచారణను డిసెంబర్,4కు వాయిదా వేసిన ధర్మాసనం

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన పెన్నా సిమెంట్స్ వ్యవహా రంలో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై కేసును ఈ దశలో కొ ట్టివేయ వద్దని సీబీఐ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.ఆమె నేరం చేశారా లేదా అనేది సీబీఐ కోర్టులో జరిగే విచారణలోనే తేలుతుందని,అందువల్ల ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిష న్‌ను అనుమతించరాదని స్పష్టం చేసింది.శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రా సిక్యూటర్ శ్రీనివాస్ కాపాటి వాదనలు వినిపిస్తూ శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చేయడానికి కేం ద్ర సిబ్బంది,శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) ఇప్పటికే అనుమతి మంజూరు చేసిందని గుర్తుచేశారు.అనుమతి ఇచ్చారా లేదా అన్నదే ముఖ్యం కానీ,ఎప్పుడు ఇచ్చారనేది కాదని పేర్కొన్నారు.ఈ కేసు నేరుగా లంచం తీసుకున్న వ్యవహారం కాదని,ఇది నేరపూరిత దు ష్ప్రవర్తనకు సంబంధించినదని కోర్టుకు వివరించారు.అయితే,శ్రీలక్ష్మి తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి వాదిస్తూ ఈ కేసులో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు.పాత నేరానికి కొత్తగా సవరించిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం డీఓపీటీ అనుమతి ఇవ్వడం చెల్లదని వాదించారు.దాన్ని సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోవడం కూడా సరైంది కాద ని పేర్కొన్నారు.ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం,తదుపరి విచారణను డిసెంబర్,4వ తేదీకి వాయిదా వేసింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...