గంజాయి డాన్...ఈ లేడి...పోలీసు విచారణలో విస్తూపోయే నిజాలు...

గంజాయి డాన్...ఈ లేడి...పోలీసు విచారణలో

విస్తూపోయే నిజాలు

VS9TV న్యూస్,నెల్లూరు :
నెల్లూరు జిల్లాలో ఇటీవల శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయా...అన్నట్లు ఉంది తా జా పరిస్థితి.తప్పు చేసిన వారిని పట్టు కునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి దిగుతున్న సందర్భాలు ఇటీవల చాలానే జరిగాయి.గతంలో విజయవాడ నుంచి గంజాయి దందా చేపడుతున్న ముఠాను పోలీసులు వెంబండించగా...నెల్లూరులో పోలీసులపై దాడికి పా ల్పడ్డారు.ఆ సందర్భంలో పోలీసులు కాల్పులు జరిపి ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది. నెల్లూరులో మరో లేడీ డాన్...ఇటీవలే రౌడీ షీటర్ శ్రీకాంత్,అతని ప్రియురాలు నిడి గుంట అరుణ వ్యవహారం బయటపడింది.పెరోల్ మీద బయటకు వచ్చి వారిద్దరూ చేసిన సెటిల్మెంట్ల వ్యవహారం వెలుగు చూడగా...లేడీ డాన్ అరుణ తాజాగా ఓ వ్యక్తిని దారు ణంగా హత్య చేసింది.ఆ హంతకులను పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులకు కూడా ఇ లాంటి అనుభవమే ఎదురైంది.నెల్లూరు రూరల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాల నీలో కె. పెంచలయ్య(38),దుర్గా దంపతులు నివాసం ఉంటున్నారు.వీరికి ఇద్దరు బిడ్డలు.ఎలక్ట్రి షియన్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే పెంచలయ్య...కొన్నేళ్ల కిందట బోడిగా డితోట నుంచి హౌసింగ్ బోర్డు కాలనీకి మారారు.సమాజ స్పృహతో పాటు వామపక్ష భావజాలం ఉండే ఈయన...సీపీఎంలో నాయకుడిగా,ఆర్డీటీ కాలనీ ముత్యాలమ్మ గ్రామా భివద్ధి కమిటీ సభ్యుడిగా ఉన్నారు.కాలనీలో కొందరు యువకులు గంజాయి తాగడం ...విచ్చలవిడిగా విక్రయాలు జరగడం గమనించి అడ్డుకున్నారు.సదరు విక్రయాలు ఓ మ హిళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిసి..పోలీసులకు సైతం సమాచారం అందించే వారు.దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న గంజాయి బ్యాచ్...ఎలాగైనా అంతమొందిం చాలని నిర్ణయించుకున్నారు.గత శుక్రవారం సాయంత్రం పిల్లలతో స్కూటీపై ఇంటికి వె ళుతుండగా...హౌసింగ్ బోర్డు ఆర్చి వద్ద తొమ్మిది మంది గుర్తు తెలియని యువకులు పెం చలయ్యను అడ్డుకున్నారు.మాకే అడ్డు వస్తావా అంటూ ఒక్కసారిగా వారంతా కత్తులతో దాడికి పాల్పడ్డారు.బాధితుడు ప్రాణ భీతితో పారిపోతుండగా...వెంటాడి పొడిచి మరీ ప రారయ్యారు.తీవ్రగాయాలైన పెంచలయ్యను స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా...అప్ప టికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు..ఈ నేపథ్యంలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వ ద్ద నిందితులు ఉన్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేసేం దుకు వెళ్లగా పోలీసులుపై కత్తితో దాడికి యత్నించారు.ఈ ఘటనలో ఆదినారాయణ అనే కానిస్టేబు ల్‌కు గాయాలయ్యాయి.దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులపై కాల్పులు జరిపా రు.ఈ కాల్పులలో జేమ్స్ అనే నిందితుడి మోకాలికి గాయాలయ్యాయి.మరో తొమ్మిది మంది నిందితులు పరారయ్యారు.పోలీసులు వాళ్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.నింది తుడు జేమ్స్,కానిస్టేబుల్ ఆదినారాయణకు నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొం దుతున్నారు.గత రెండు మూడు నెలల నుంచి ప్రశాంతంగా ఉన్న నెల్లూరులో మళ్లీ గం జాయి,రౌడీయిజం పడగ విప్పడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది.పెంచలయ్య హత్యలో కల్లూరుపల్లి ఆర్.డీ.టీ కాలనీకి చెందిన అరవ కామాక్షి హత్య చేయించినట్లు దాదాపు నిర్ధారణ అయినట్లు సమాచారం.దొంగతనాలకు పాల్పడే వ్యక్తులతో అసాంఘీక కార్యక్రమాలు చేయించడం,నేరచరిత్ర కలిగిన వ్యక్తులను ప్రొత్సహించినట్లు పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది.ఇలాంటి పద్దతులు మంచిది కాదు అని మంద లించినందున పెంచలయ్యను హత్య చేయించినట్లు పోలీసు విచారణలో తేలింది.స్థానిక బోడిగాని తోట వద్ద నివాసం ఉంటూ తన భర్త లారీ డ్రైవర్‌గా చుట్టుపక్కల వారికి చెబు తూ గంజాయి దందా కొనసాగించేదని,నిరుద్యోగులుగా ఉన్న యువతతో ఈ దందా చే యిస్తున్నట్లు తేలింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...