ఆరు నెలల తర్వాత అమ్మ ఒడికి చేరిన ఆరొహి...

ఆరు నెలల తర్వాత అమ్మ ఒడికి చేరిన ఆరొహి

VS9TV న్యూస్,హైదరాబాద్ :
ముంబై చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్లో 2025, మే,20 రాత్రి ఒక చి న్నారి తన అమ్మ ఒడిలో నిద్రపోయింది.సోలాపూర్ నుండి వచ్చిన ఆ తల్లిదండ్రులు,తండ్రి చికిత్స కోసం ముంబై చేరి,అలసటతో కళ్లు మూసుకున్నారు.కేవలం ఒక్కక్షణం అమ్మ క ళ్లు మూసింది.తిరిగి తెరిచేలోపే ఆ చిన్నారి అదృశ్యమైంది.ఆ అమ్మకు ప్రపంచం చీకట్లో మిగిలింది.ఆరు నెలలుగా పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతూ,అదే మడిచిన పాప ఫోటో ను రైళ్లలో,బస్తీల్లో, అనాథాశ్ర మాల్లో చూపిస్తూ తల్లిదండ్రులు వెతికారు.నిద్రలేక తండ్రి, భోజనం చేయలేక తల్లి,"ఆరొహి...ఆరొహి..."అని రాత్రంతా కన్నీరు కార్చారు.ఆశ సన్న గిల్లినా,ముంబయి పోలీసులు మాత్రం కేసును వదల్లేదు.పోస్టర్లు ముద్రించి ముంబై ప్లాట్ ఫారమ్ ల నుంచి భుసావల్ వరకు,వారణాసి వరకు అతికించారు.వార్తాపత్రికల్లో ప్రకటన లు ఇచ్చారు.జర్నలిస్టులను,ప్రజలను అడిగారు.కొంతమంది పోలీసు అధికారులు ఆమె ఫో టోను తమ జేబులో పెట్టుకుని తిరిగారు.అంతలో వెయ్యి కిలోమీటర్ల దూరం వారణాసిలో జూన్ లో రైల్వే ట్రాక్ పక్కన కనబడిన ఓ చిన్నారి "కాశి" అనే కొత్త పేరుతో జీవనం మొ దలుపెట్టింది.ఆ అనాథాశ్రమంలో ఆమెకు ఆహారం,మంచం,పేరు ఇచ్చారు.కానీ రాత్రిపూట "ఆయి" అని పిలుస్తూ ఏడిచినప్పుడు,ఆ మాటను అక్కడ ఎవరూ అర్థం చేసుకోలేదు. ఆ మెకు నిజానికి ఆరొహి అనే పేరు ఉందనే విషయం ఎవరికి తెలియదు.నవంబర్,13న వా రణాసిలో ఒక స్థానిక రిపోర్టర్ పోస్టర్ ను చూసి షాక్ అయ్యాడు.తనకు తెలిసిన చిన్నా రి రాత్రిళ్లు మరాఠీ పదాలు మాట్లాడుతుందని గుర్తు కు వచ్చింది.వెంటనే ఫోన్ చేశాడు. మరుసటి రోజు ముంబయి పోలీసు అధికారి వారణాసిలో వీడియో కాల్ ప్రారంభించా డు.స్క్రీన్ పై కనిపించిన చిన్నారి పింక్ డ్రెస్లో ఉంది.ఆమె కనిపించకుండా పోయిన రోజు న వేసుకున్న రంగే.ముంబైలో ఉన్న తల్లి అది చూసి నిశ్శబ్దంగా కుప్పకూ లింది.తండ్రి "అ దే నా ఆరొహి...నా బిడ్డ..."అని ఏడుస్తూనే ఉన్నాడు. నవంబర్,14న చిల్డ్రెన్స్ డే దినో త్సవం ఆమెను విమానంలో ముంబైకి తీసుకొచ్చారు.విమానం దిగిన వెంటనే మొత్తం ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆమె కోసం బెలూన్లు,కొత్త నీలి డ్రెస్ తీసుకుని ఎదురు చూసింది. కా నీ చిన్నారి చేసింది అక్కడ అం దరినీ ఆశ్చర్యపరిచింది...ఆమె పరుగె త్తింది.ఎక్కడికో కా దు...పోలీసుల వైపు...చిన్న కాళ్లతో పరిగెత్తుకుంటూ ఒక అధికారి ఒడిలో పడి నవ్వింది. కఠినంగా కనిపించే ఆ అధికారి కళ్లలో నీళ్లు మెరిశాయి.అతను ఆమెను ఎత్తుకుని తన ఆ ప్యాయతను చూపాడు.తల్లిదండ్రులు భావోద్వేగంతో నడవలేకపోయారు.పోలీసులే చి న్నారిని వారి దగ్గరకు తీసుకె ళ్లారు.తల్లి ఆరొహి ముఖాన్ని మళ్లీ మళ్లీ తాకి నిజమేనా అని చూసుకుంది.తండ్రి చిన్నారి పాదాలపై తలవంచి తాకించు కున్నాడు.ఆరొహి మాత్రం అ మాయకంగా నవ్వుతూ పోలీసులను,తల్లిదండ్రులను చూస్తూ సంతోషంగా ఉండిపో యింది.ఆ క్షణంలో ఒక పోలీస్ స్టేషన్ మొత్తం కన్నీ ళ్లు,నవ్వులు,ప్రార్థనలతో నిండిపో యింది.ఆరు నెలల చీకటి ఒక హగ్గుతో ముగిసింది.ఆరొహి ఇప్పుడు అమ్మ ఒడిలో సురక్షి తంగా ఉంది.అపహరణ చేసిన వ్యక్తి ఇంకా బయట ఉన్నా,అది రేపటి పోరాటం.నేడు మాత్రం ఇంట్లో తల్లి మళ్లీ లాలి పాటలు పాడుతోంది.తండ్రి చిరున వ్వుతో నిద్రపోతున్నా డు.ముంబైలో కొంత మంది పోలీసులు నాలుగు ఏళ్ల పిల్ల బరువుని మాత్రమే కాదు.ఒక కుటుంబ జీవితం తిరిగి ఇచ్చిన భావనను కూడా గుండెల్లో పెనవేసుకుని మరిచిపోలేరు. కొన్ని సార్లు యూనిఫాం దొంగలను మాత్రమే పట్టదు.కోల్పోయిన పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చడంతో వారి గుండెల్లోని ఆవేదనకు స్వస్తిపలికించడం అనే వాస్తవం ఈ ఘటన సమాజానికి గుర్తుచేస్తోంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...