తిరుమల,తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బి.ఆర్ నాయుడు)ని మర్యాద పూర్వకంగా కలిసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ....
తిరుమల,తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బి.ఆర్ నాయుడు)ని మర్యాద పూర్వకంగా కలిసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ
తిరుమల,తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షులు బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బి.ఆర్ నాయుడు)ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మ న్ కమ్మరి పార్వతమ్మ,బ్రహ్మశ్రీ ధనాలకోట శోభన్ బాబు,బ్రహ్మశ్రీ డాక్టర్ కొత్తపల్లి సత్య నారాయణ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణ జాతీయుల తరుపున కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల దేవస్థానం నుండి భూత,భవిష్యత్తు, వర్తమాన కాలజ్ఞాన విరిచితులు,ఆ గామీ సంఘసంస్కర్త శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి,గోవింద మాంబ అ మ్మవార్ల కళ్యాణోత్సవం,శ్రీ ఈశ్వరి మాత అమ్మవారి ఆరాధన ఉత్సవము నందు పట్టు వ స్త్రాలు అన్ని లాంఛనా లతో సమర్పించుటకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 25లక్షల మంది విశ్వబ్రా హ్మణ కుటుంబాలకు వంశ పారంపర్య ఆరాధ్య దైవము శ్రీ మహా విష్ణు స్వ రూపమైన శ్రీశ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ప్రవచనాలు మహిమలు.1. వీరబ్రహ్మేంద్రస్వామి వారి దంపతుల కల్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం శివరాత్రి ప ర్వదినమున బ్రహ్మంగారి మఠం నందు అత్యంత వైభవముగా జరుపబడుతుంది.2.వైశాఖ శుద్ధ దశమి రోజున శ్రీ స్వామి వారు సజీవ సమాధి చెంది నిష్టాగరిష్టులై వేంచేసి ఉన్న రోజు వారి ఆరాధన ఉత్సవం జరుగుతుంది.3.శ్రీ స్వామివారి మనుమరాలు శ్రీ మాత ఈ శ్వరి మాత ఆరాధన ఉత్సవాలు ప్రతి సంవత్సరం మార్గశిర బహుళ నవమి రోజున జరుప బడుతున్నాయి.పై మూడు సందర్భాలలో తిరుమల,తిరుపతి దేవస్థానం నుండి సకల లాం ఛనాలతో పట్టు వస్త్రములను సమర్పించాలని తిరుమల,తిరుపతి దేవస్థానం పాలక మం డలి అధ్యక్షులు బి.ఆర్.నాయుడుని విన్నవించారు.అదేవిదంగా సుస్థిర నిర్ణయాన్ని తీసు కుని విశ్వబ్రాహ్మణ బంధువుల ఆత్మాభిమానాన్ని కాపాడి,రాష్ట్రంలో ఉన్న విశ్వ బ్రాహ్మణ జాతీయుల అభిమానాన్ని సంపూర్తిగా పొందాలని,అత్యంత హృదయ పూర్వ కంగా కో రారు.ప్రపంచ వ్యాప్తంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి చరిత్రను,విశ్వ బ్రాహ్మ ణ గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు ఒక మరుపురాని,మరిచిపోని గుర్తుగా కొన్ని తరాల పాటు ఈ రాష్ట్రంలో పాలక మండలి విశాల హృదయాన్ని ధార్మిక,సనాతన ధర్మ పరిరక్ష ణకు కట్టుబడిన విషయాన్ని విశ్వబ్రాహ్మణ జాతి మొత్తం కీర్తిస్తుందని సవినియంగా తెలి యజేశారు.సానుకూలంగా స్పందించిన అధ్యక్షులు బిఆర్ నాయుడు తప్పని సరిగా తమ విన్నపాన్ని పాలక మండలిలో ఆమోదింపజేసి,అందులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వబ్రా హ్మణుల తరుపున వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Post a Comment