చట్టాలు చేయడం ముఖ్యం కాదు.. వాటిని పాటించడం ముఖ్యం...అమరావతిలో ఆస క్తికరంగా సాగిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ...

చట్టాలు చేయడం ముఖ్యం కాదు...వాటిని పాటించడం ముఖ్యం
ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలకు ప్రభుత్వం
నిర్మాణాత్మక పరిష్కారం చూపింది
ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం
అమరావతిలో ఆసక్తికరంగా సాగిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ
మాక్ అసెంబ్లీలో విద్యార్థుల మధ్య నిర్మాణాత్మక చర్చ
పిల్లల కోసం రూపొందించిన 
భారత రాజ్యాంగం పుస్తకం ఆవిష్కరణ

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : 
చట్టాలు చేయడం ముఖ్యం కాదు...వాటిని పాటించడం ముఖ్యం.ప్రతిపక్షం లేవనెత్తిన స మస్యలకు ప్రభుత్వం నిర్మాణాత్మక పరిష్కారం చూపింది.ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వా మ్యానికి నిదర్శనం అని విద్యార్థుల మాక్ అసెంబ్లీ అభిప్రాయపడింది.రాజ్యాంగ దినోత్స వాన్ని పురస్కరించుకుని అమరావతిలోని రాష్ట్ర శాసనసభ ఆవరణలో విద్యాశాఖ ఆధ్వ ర్యంలో ‘ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ’ పేరుతో జరిగిన జరిగిన విద్యార్థుల మాక్ అ సెంబ్లీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.రాజ్యాంగ విలువలు,అసెంబ్లీ సమావేశాలపై వి ద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న ఆలోచ నకు శ్రీకారం చుట్టారు.అసెంబ్లీ తరహాలోనే విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరిగింది.175 ని యోజక వర్గాల నుంచి 175మంది విద్యార్థులను ఎంపిక చేశారు.మాక్ అసెంబ్లీలో ము ఖ్యమంత్రిగా ఎం.లీలా గౌతమ్,ప్రతిపక్ష నేతగా సౌమ్య,డిప్యూటీ సీఎంగా కోడి యోగి, వి ద్యాశాఖ మంత్రిగా చిన్మయి,స్పీకర్ గా స్వౌతి వ్యవహరించారు.ఈ మాక్ అసెంబ్లీలో వి ద్యార్థి ప్రతినిధులు అన్నీ తామై ముందుండి నడిపించారు.బిల్లులు ఎలా పాస్ చేస్తారు.పా స్ చేసిన బిల్లు ఎలా ఆమోదం పొందుతుంది,ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తుంది,అధికార ప క్షం ఎలా వ్యవహరిస్తుందో ఈ మాక్ అసెంబ్లీ ద్వారా విద్యార్థులు తెలియజెప్పారు.

స్పీకర్ కుర్చీకి కుడి,ఎడమలు ఉండవు...
రాజ్యాంగం,సభా నియమాలు మాత్రమే ఉంటాయి :

విద్యార్థుల మాక్ అసెంబ్లీలో ముందుగా ప్రొటెం స్పీకర్,స్పీకర్ ఎన్నిక జరిగింది.సభలోకి ప్రొటెం స్పీకర్ రాగానే సభ్యులందరూ లేచి నిలబడ్డారు.జాతీయగీతంతో సభను ప్రారం భించారు.అనంతరం స్పీకర్ పదవికి ప్రొటెం స్పీకర్ నామినేషన్లను ఆహ్వానించారు.కో డూరు ఎమ్మెల్యే కే.లోకేశ్వర్ రెడ్డి కుమారి స్వాతిని స్పీకర్ గా ప్రతిపాదించారు.ఎమ్మెల్యే బి.అనిల్ కుమార్ ఈ ప్రతిపాదనను బలపరిచారు.స్వాతి స్పీకర్ గా ఎన్నికైనట్లు అధికారి కంగా ప్రకటించారు.దీంతో ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నేత స్పీకర్ ను గౌరవంగా చైర్ వద్దకు తీసుకెళ్లారు.సభ్యులందరూ బల్లలు చరిచి తమ ఆమోదాన్ని తెలిపారు.స్పీకర్ వచ్చినప్పుడు సభ్యులందరూ లేచినిలబడ్డారు.స్పీకర్ గా ఎన్నికైనందున సీఎం హృదయపూర్వక శుభా కాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...అధికార,ప్రతిపక్షానికి స్పీకర్ స మాన త్రాసు లాంటి వారు.సభను సజావుగా నడపడంలో మా పూర్తి సహకారం ఉంటుం దని తెలిపారు.ప్రతి పక్ష నేత కూడా స్పీకర్ కు శుభాకాంక్షలు తెలిపారు.స్పీకర్ కుర్చీలో కూర్చొన్న తర్వాత మీకు పార్టీ ఉండదు,కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది,ప్రభుత్వ మె జార్టీతో మా గొంతు నొక్కాలని చూస్తే...మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే,ప్రతిపక్షం గొంతుకను మీరు కాపాడతారని ఆశిస్తున్నా అంటూ ప్రతిపక్ష నేత పేర్కొన్నారు.స్పీకర్ స్పందిస్తూ...ఈ కుర్చీకి కుడి,ఎడమలు ఉండవు,కేవలం రాజ్యాంగం,సభా నియమాలు మాత్రమే ఉంటాయి,ప్రతిపక్షానికి తగిన సమయం ఇస్తాను,ప్రభుత్వం నుంచి తగిన సమా ధానాలు రాబడతాను,సభా గౌరవాన్ని కాపా డటం మనందరి బాధ్యత అని తెలిపారు. 

క్వశ్చన్ అవర్,జీరో అవర్ నిర్వహణ :

స్పీకర్ ఎన్నిక అనంతరం క్వశ్చన్ అవర్,జీరో అవర్ నిర్వహించారు.ప్రశ్నోత్తరాల సమ యంలో వ్యవసాయం,మానవ వనరులు,పంచాయతీ రాజ్,విద్యుత్,రవాణ, హోం,క్రీడా, మహిళా శిశు సంక్షేమం,పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించి పది ప్రశ్నలు అడిగారు.ఆ యా ప్రశ్నలకు మంత్రులుగా ఉన్న విద్యార్థి ప్రతినిధులు సమాధానం ఇచ్చారు.జీరో అవర్ లో తుఫాను సన్నాహాలు అంశంపై మాట్లాడేందుకు స్పీకర్ మూడు నిమిషాల సమయం ఇ చ్చారు.
సభా గౌరవాన్ని కాపాడాలి :
విద్యార్థుల్లో మొబైల్ వ్యవసంపై ఈ విద్యాసంవత్సరంలో ఎన్ని కేసులు నమోదయ్యాయనే ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి సమాధానం ఇచ్చారు.వందల్లో కేసులు నమోదయ్యాయని తెలి పారు.మొబైల్ వ్యవసం కేసుల్లో కౌన్సిలింగ్,లేదా ప్రత్యేక రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏమీ ఏ ర్పాటుచేయడం లేదని,డి-అడిక్షన్ సెంటర్స్ ఏర్పాటుచేసే యో చన ప్రభుత్వ పరిశీలనలో ఉందని సమా ధానం చెప్పారు.మంత్రి సమాధానంపై ప్రతిపక్ష సభ్యుడు స్పందిస్తూ...కేసు లపై కచ్చితమైన లెక్కలు లేవని,పైలట్ సెంటర్స్ భూమి మీదకు వచ్చేలోగా విద్యార్థుల భవి ష్యత్ స్పిచ్ ఆఫ్ అయిపో తుందని,కేసులపై ప్రభుత్వం దాటవేస్తోందని ధ్వజమెత్తారు.పై లట్ సెంటర్స్ ఎప్పుడు వస్తాయో తేదీ చెప్పాలని డిమాండ్ చేశారు.దీంతో సభలో గందర గోళం నెలకొంది.సభా గౌరవాన్ని కాపాడా లని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. 
మీరు కేవలం అల్లరి మీద దృష్టిపెట్టారు :
సభ్యుడి లేవనెత్తిన అంశాలపై మంత్రి స్పందిస్తూ...మా ప్రభుత్వం విద్యార్థులను నేరస్థులు గా చూడటం లేదు,బాధితులుగా చూస్తోంది.పిలల చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే అది మొ బైల్ వ్యవసనమంటారు.దానిని సరిచేయవచ్చు.కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పారు.ఈ స మయంలో మైక్ కట్ కావడంతో...ప్రతిపక్ష సభ్యురాలు కుమారి నిహారిక స్పందిస్తూ...అ ధ్యక్షా మా మైక్ లు కట్ చేశారా అని ప్రశ్నించారు.ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ను డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ...ప్రభు త్వం ఏం చేసినా గుడ్డిగా వ్యతిరేకించే,మీ మైక్ వ్యసనానికి మాత్రం ప్రపంచంలో ఏ రీహాబిలిటేషన్ సెంటర్ మందు కనిపెట్ట లేదు.పిల్ల లకు కౌన్సిలింగ్ పనిచేస్తుంది, మీకు పనిచేయదు.మేం పైలట్ సెంటర్స్ పై దృష్టి పెట్టాం, మీరు కేవలం అల్లరి మీద దృష్టిపెట్టారని మండిపడ్డారు.
రంగంలోకి దిగిన మార్షల్స్ :
విద్యార్థుల మాక్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్ లైన్ భద్రత-సోషల్ మీడియా నియం త్రణ బిల్లు-2025,ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం-2025 బిల్లులు ప్రవే శపెట్టారు.క్లాజ్ లపై ఓటింగ్ నిర్వహించారు.రెండు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.ప ర్యావరణ రికార్డుల బరువు పిల్లల నెత్తిన మోపుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావ రణ పరిరక్షణ చట్టం-2025 బిల్లుపై ప్రతిపక్షం అభ్యంతరం లేవనెత్తింది.వెల్ లోకి దూసు కువచ్చి నిరనస తెలిపారు.దీంతో మార్షల్స్ రంగంలోకిదిగి ఆందోళనకు దిగిన సభ్యులను బయటకు తరలించారు.ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటడం ఉద్దేశం పిల్లలకు బాధ్యత నే ర్పడం అని మంత్రి సమాధానం ఇచ్చారు. 
పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకం ఆవిష్కరణ :
మాక్ అసెంబ్లీ అనంతరం పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. విద్యార్థులందరితో కలిసి సీఎం,స్పీకర్,మంత్రులు,ఎమ్మెల్యేలు,అధికారులు గ్రూప్ ఫోటో ది గారు.అనంతరం శాసనసభ,శాసనమండలి హాల్ ను మంత్రి లోకేష్ స్వయంగా విద్యార్థు లకు చూపించారు.వారితో కలిసి భోజనం చేశారు.విద్యార్థులు,తల్లిదండ్రులు,ఉపాధ్యా యులతో ఫోటోలు దిగారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....