అర్చక పౌరోహితులను కించపరిచేలాగా పాట పాడిన పల్లెవోలు రమణ,సిడి నరసయ్యలపై క్రిమినల్ కేసును నమోదు చేయాలి...
అర్చక పౌరోహితులను కించపరిచేలాగా పాట పాడిన పల్లెవోలు రమణ,సిడి నరసయ్యలపై క్రిమినల్ కేసును నమోదు చేయాలిఎస్.కె.శ్రీనివాసరావు,ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్
బ్రాహ్మణులను కించపరుస్తూ,వ్యంగ్యంగా వారి ఆచార వ్యవహారాల గురించి పాటగా పా డుతూ,ఇతర సామాజిక వర్గాల వారిని బ్రాహ్మణులపైకి ఉసిగొల్పే ప్రయత్నం చేస్తూ,"అం గి ఎందుకు వేసుకోవు ఓ బాపనయ్య" అంటూ బ్రాహ్మణ సమాజాన్ని,అర్చక పౌరోహితుల ను కించపరిచేలా పాట పాడిన పల్లెవోలు రమణ,సిడి నరసయ్య భారతీయ నాస్తిక సమా జంపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని,యూట్యూబ్ ఛానల్ నుంచి పాటను తీసివే యాలని కోరుతూ సోమవారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఎస్.కె.శ్రీని వాసరావు ఆధ్వర్యంలో నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని వినతి పత్రం అందచేశారు.ఈ సందర్బంగా ఎన్డీఏ కూటమి నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నా యకులు ఎన్.వి.రామకృష్ణ,మాదన్న,భారతీయ జనతా పార్టీ నాయకులు రామ్మోహన్ రె డ్డి,జనసేన 29వ డివిజన్ ఇంచార్జ్ షబ్బీర్,బ్రాహ్మణ సంఘం నాయకులు సురేష్,సోమ నాథ్,బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద్ లు పొల్లవోలు రమణ బ్రాహ్మణులను కించప రచడాన్ని తీవ్రంగా ఖండించారు.
Comments
Post a Comment