ఈగల్ సైకిల్ ర్యాలీ...“డ్రగ్స్ వద్దు బ్రో–సైకిల్ తొక్కు బ్రో”...
ఈగల్ సైకిల్ ర్యాలీ...“డ్రగ్స్ వద్దు బ్రో – సైకిల్ తొక్కు బ్రో”FIT INDIA – SUNDAYS ON CYCLE
ఆంధ్రప్రదేశ్ “ఈగల్” (Elite Anti-Narcotics Group for Law Enforce ment) విభాగాధిపతి ఇన్స్ పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ఆకే.రవికృష్ణ పర్యవేక్షణలో ఆది వారం “ఫిట్ ఇండియా – సండే ఆన్ సైకిల్ ర్యాలీ” లో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో–సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో కర్నూలులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి టీ.జీ.భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి,ఈగల్ ఎ స్పీ నగేష్ బాబు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యా రు.ఈ సందర్బంగా స్థానిక కొండా రెడ్డి బురుజు నుంచి యస్ వి కాంప్లెక్స్ సర్కిల్,ఆర్.ఎస్.రోడ్డు,రాజ్ విహార్ మీదుగా డిస్ట్రి క్ట్ పోలీస్ ఆఫీసు కూడలి వరకు డ్రగ్స్ కు వ్యతిరేకంగా దాదాపు 400మంది సైకిల్ తొక్కు తూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలి నిర్వహించారు.
అనంతరం ఏపీ పరిశ్ర మల శాఖా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ...డ్రగ్స్ నిర్మూలన కో సం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు.డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు.కర్నూలు జిల్లాలో డ్రగ్స్ వినియోగం తక్కువగా ఉండడం సంతోషంగా ఉందని పూర్తిగా నిర్మూలిద్దాం అని చె ప్పారు.రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూ లనపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని,ప్రభు త్వం ఏర్పడిన తర్వాతే ఈగల్ సంస్థ స్థాపించబ డిందని తెలిపారు.“డ్రగ్స్ వినియోగం ఆ పేందుకు సమాజం కూడా ముందుకు రావాలని కోరారు.డ్రగ్స్ సమాచారం ఉంటే ఈగ ల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కి కాల్ చేసి తెలపండి అని విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్యే గౌరు చ రిత మాట్లాడుతూ...
డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాల్సిన బాధ్యత ఉంద ని,డ్రగ్స్ వ్యతిరేక ఉద్య మంలో ప్రజలు భాగస్వాములు కావాలనీ కోరారు.డ్రగ్స్ వల్ల జాతీయ సంపదకు నష్టం, యువత భవిష్యత్తు దెబ్బతింటుందని,డ్రగ్స్ బారిన పడి యువత భవిష్యత్తు నాశనం చేసు కోవద్దు అనీ తెలిపారు.ఈగల్ ఎస్పీ నగేష్ బాబు మాట్లాడుతూ...డ్రగ్స్ అంతం కొరకై ప్ర తి ఒక్కరు బాధ్యతగా ఉంటూ డ్రగ్స్ నిర్మూలన క్రమంలో పోలీసు శాఖతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని తెలిపారు.డ్రగ్స్ వలన కలిగే అనర్ధాలను చాటుతూ ప్రజా చైత న్యం కోసం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. ఎవరికైనా డ్రగ్స్ సంబంధిత సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1972కు తెలియజేయాలి అని వి జ్ఞప్తి చేశారు.ఈగల్ విభాగం నేతృత్వంలో జిల్లాలో డ్రగ్స్ నిర్మూలన కోసం చేపడుతున్న సైకిల్ ర్యాలీ ఎంతో ప్రాముఖ్యత కలిగిందని తెలిపారు.డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపడమే కా కుండా,అవగాహన కార్యక్రమాలు,ప్రత్యేక ఆపరేషన్లు,N-CORD మీటింగ్‌లు కూడా స మగ్రంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. “డ్రగ్స్ అనేది సమాజానికి అంటుకునే మహ మ్మారి.దీనిని పూర్తిగా తరిమికొట్టా లన్నారు. ప్రతి ఒక్కరు “డ్రగ్స్ వద్దు బ్రో” అనే సందే శాన్ని గ్రహించి,పెద్ద ఎత్తున సమాజంలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.కర్నూలు లోని రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద డ్రగ్స్ వద్ద బ్రో నినాదంతో యువతకు,మహిళలకు అవగాహ న కల్పించారు.ఈగల్ టీం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ తగ్గుముఖం పట్టింద న్నారు.డ్రగ్స్ పై రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో అవగాహన కల్పిస్తున్నామని అందులో భాగంగా కర్నూలులో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం నిర్వహించామన్నారు.అల్లూరి సీతారా మ రాజు జిల్లాలో గంజాయి సాగు పూర్తిగా అరికట్టామన్నారు.కర్నూలు జిల్లా రెడ్ క్రాస్ సోసైటీ అధ్యక్షుడు డాక్టర్.గోవిందు రెడ్డి మాట్లాడుతూ...ఈగల్ టీంతో కలిసి రాష్ట్ర వ్యా ప్తంగా పనిచేసేందుకు రెడ్ క్రాస్ సొసైటీ సిద్దమౌతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స దరన్ రీజియన్ హోం గార్డు కమాండ్ మహేష్ కుమార్, అడిష నల్ ఎస్పీ హుస్సేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్,ఈగల్ పోలీస్ అధికారులు,సిఐలు,ఆర్ఐలు ఎస్ఐ లు,జిల్లా పోలీస్ సిబ్బంది,ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్,అసిస్టెంట్ కమిషనర్ వారి అధికా రులు,సిబ్బంది,సెట్కుర్ సియుఓ,రెడ్ క్రాస్ జిల్లా ఇంచార్జీ గోవిందరెడ్డి,సాయి స్పోర్ట్స్ యువత,ప్రజలు పెద్ద సంఖ్యలో డ్రగ్స్ వ్యతిరేకంగా సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు.
Comments
Post a Comment