తెలంగాణలో పెరుగుతున్న మద్యం దుకాణాలపై హైకోర్టు సీరియస్...

తెలంగాణలో పెరుగుతున్న మద్యం 
దుకాణాలపై హైకోర్టు సీరియస్
ఇలాగే కొనసాగితే తెలంగాణ పేరు మార్చాల్సి వస్తుంది
హైకోర్టు వ్యాఖ్యలు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
తెలంగాణ హైకోర్టు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల సంఖ్య పెరుగుతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.రాష్ట్రంలో ఇదే వేగంతో మద్యం దుకాణాల సంఖ్య పెరిగితే...త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించిం ది.అయితే రాష్ట్రంలో మద్యం వినియోగం,దుకాణాల సంఖ్య విషయంలో హైకోర్టు పాత్ర చాలా తక్కువ అని కోర్టు తెలిపింది.అసలింతకు కోర్టు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసింది అంటే...నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మ ధ్య మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశా రు.మద్యం దుకాణాన్ని అక్కడి నుంచి తరలించాలని సూచించారు.కానీ వారి మాటలను ఎవరూ పట్టించుకోలేదు.దీంతో కాలనీ వాసులు ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు.తాజాగా ఈ పిటిషన్‌ని విచారించిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.రాష్ట్రంలో ఇలా ఇష్టానుసారంగా మద్యం దుకాణాలను పెంచు కుంటూపోతే...త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.అలానే రాష్ట్రంలో మద్యం షాపుల నియంత్రణ మీద తమకు పూర్తి అధికారాలు లేవని ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు తెలిపింది.అయినప్పటికీ ఈ అం శంలో తాము విధానపరమైన నిర్ణ యం తీసుకునే వరకు ఆదేశాలు జారీ చేయగలమని కోర్టు స్పష్టం చేసింది.ఇప్ప టికే రోడ్లపైకి మద్యం షాపులు కనిపించ కుండా ఏర్పాటు చే యాలని ఆదేశాలు జారీ చేసినా...ప్రభుత్వం వాటిని కనీసం పట్టించుకోవడం లేదని కో ర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇక నాగారం మున్సిపా లిటీలో జనావాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర మున్సిపల్,ఎక్సైజ్ అధికారులతో పాటు..షాపు ఏర్పాటు చేసిన వారికి కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చే సింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...