గోదావరిలో తప్పిన పెను ప్రమాదం... 100మంది ప్రయాణికుల సురక్షితం...
గోదావరిలో తప్పిన పెను ప్రమాదం100మంది ప్రయాణికుల సురక్షితంఇంజిన్లో సాంకేతిక లోపంతో ఘటనమరో పంటు సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేరికఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లో పెను ప్రమాదం తప్పింది.సఖినేటి పల్లి,పశ్చిమ గోదావరి జిల్లా,నరసాపురం మధ్య వశిష్ఠ గోదావరిలో 100మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న పంటు నది మధ్యలో ఆగిపోయింది.ప్రవాహ వేగానికి సాగర సంగమం వైపు కొ ట్టుకుపోతుండగా,సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను సురక్షితంగా ఒ డ్డుకు చేర్చారు.వివరాల్లోకి వెళితే...నరసాపురం నుంచి సఖినేటిపల్లికి ప్రయాణికులతో బ యలుదేరిన పంటు,నది మధ్యలోకి రాగానే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.దీం తో ఒక్కసారిగా ఆగిపోయింది.సిబ్బంది మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించినా ఫలి తం లేకుండా పోయింది. అదే సమయంలో నదిలో ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో పంటు అదుపుతప్పి అంతర్వేది సాగర సంగమం వైపు కొట్టుకు పోవడం ప్రారంభించింది. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్రఆందోళనకు గురయ్యారు.విషయం తెలుసుకున్న ని ర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు.మరో పంటును పంపి,దాని సహాయంతో నిలి చిపోయిన పంటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.దీంతో ప్రయాణికులు,వారి బంధువు లు ఊపిరి పీల్చుకున్నారు.ఈ రెండు జిల్లాల మధ్య రోజూ వేలాది మంది ఈ పంటుల మీదే రాకపోకలు సాగిస్తుంటారు.
Comments
Post a Comment