కాటికి పోయే వయసులో ఇదేం పనిరా?మనుమరాలిపై తాత అఘాయిత్యం...20 సంవత్సరాలు కఠిన కారగార శిక్ష విధించిన కోర్టు...

కాటికి పోయే వయసులో ఇదేం పనిరా?
మనుమరాలిపై తాత అఘాయిత్యం 
20 సంవత్సరాలు కఠిన కారగార శిక్ష విధించిన కోర్టు
VS9TV న్యూస్,విజయనగరం :
విజయనగరం జిల్లా,గాజులరేగలో చోటు చేసుకున్న అమానుష ఘటనపై పోక్సో ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరిం చింది.తన సొంత మనవరాలిపై దారు ణంగా లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు బొండపల్లి సత్యారావు (59)కి 20 సంవ త్సరాల కఠిన కారాగార శిక్షను విధించిం ది.అంతేకాకుండా ఐదు వేల రూపాయలు జరిమానాను కూడా విధించింది.బాధిత బాలిక పునరావాసం కోసం ఐదు లక్షల పరిహారాన్ని ప్రకటించింది.విజయనగరం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆగ స్ట్,18,2025న వెలుగులోకి వచ్చింది.తన తాత సత్యారావు మృగంలా మారి చేసిన అఘాయిత్యం గురించి...బాలిక తెలిసి తెలియని మాటలతో తల్లికి తెలియ జే సింది.దీంతో వెంటనే నిందితునిపై బాలిక తల్లి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశా రు.మహిళా పోలీసు స్టేషన్ ఎస్ ఐ జి. శిరీష పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి,డిఎస్పీ ఆర్.గోవిందరావు పర్యవే క్షణలో దర్యాప్తు పూర్తి చేశారు.అనంత రం నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.కేసుకు సంబంధించి కోర్టులో ఫోక్సో న్యాయస్థానం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖజానా రావు బలమైన వాదనలు వినిపించడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం.ఈ తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా బాలలపై జరిగే నేరాలకు కఠిన హెచ్చరికగా నిలుస్తుందని అన్నారు.జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్.అయితే భవిష్య త్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని తెలియజే శారు.నిందితులపై చర్యలు తీసుకోవడ మే కాకుండా చిన్నారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...