ఆత్మహత్యల ట్రాప్...జాగో తెలంగాణ బీసీ యువత...

ఆత్మహత్యల ట్రాప్-జాగో తెలంగాణ బీసీ యువత

VS9TV న్యూస్,హైదరాబాద్ :
రాజకీయం ఎంత మందిని అయినా బలి తీసుకుని తాము గెలవాలనుకుంటుంది.మీరు చ చ్చిపోవద్దు..మేమే చచ్చిపో తామని నేతలు డైలాగులు చెబుతారు.అలాంటి మాటలతో మ రింతగా ఉద్రేకపడే వారు ఆత్మహత్యలు చేసుకుంటారు.ఇప్పుడు మరోసారి తెలంగాణ యువతపై ఆత్మహత్య ట్రాప్ విసురుతోంది రాజకీ యం.బీసీ యువతను టార్గెట్ చేస్తోం ది.ఇలాంటి వారి ట్రాప్‌లో పడితే భవిష్యత్ అంధకారం అవుతుంది.
బీసీ రిజర్వేషన్ల కోసం యువకుడి ఆత్మహత్య
క్యూ కట్టిన రాజకీయ నేతలు
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన కోసం సాయి ఈశ్వర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం ప్రారంభమయింది.ఆత్మహత్య చేసుకుంటే రిజర్వేషన్లు వస్తాయ ని సాయి ఈశ్వర్ కు ఎవరు చెబుతారు? కానీ ఆయన కోసం రాజకీయ నేతలు వాలిపో వడం ప్రారంభించారు.సాయి ఈశ్వర్ భౌతిక ఖాయానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు.కేటీఆర్ ట్విట్టర్ లో ఖండిం చారు.ఇతర పా ర్టీల వారు వస్తారు.అందరూ ఒకటే చెబుతారు.మీరెవరూ చనిపోవద్దు..దాని కోసం మే మున్నామని చెబుతారు.కానీ వారి మాటలు ఎలా ఉంటాయో...అవి యువతలోకి ఎలా వెళ్తాయో చెప్పాల్సిన పని లేదు.
తెలంగాణ ఉద్యమం సమయంలో వందల మంది బలిదానాలు :
తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకు న్నారు.వారిలో అత్యధికులు బడుగులు,బలహీనవర్గాలవారే.ఆత్మహత్యలు చేసుకుంటే తె లంగాణ ఉద్యమం బలపడుతుందన్న సంకేతాలను ఇచ్చిన వారు ఎవరో అందరికీ తెలుసు. ఇప్పుడు వారంతా పదవులు అనుభవించారు.అనుభవిస్తున్నారు.కానీ ఆ కుటుంబాలు మా త్రం తమ బిడ్డల్ని పోగొట్టుకున్న కుటుంబాలు మాత్రం కుమిలిపోతున్నాయి.చివరికి తెలం గాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన వారికి న్యాయం జరగలేదని కవిత కూడా చెప్పారు. ఆమెకు కష్టం వచ్చి బయటకు వచ్చిన తరవాతనే చెప్పారు కానీ...అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ గుర్తుకు రాలేదు.రాజకీయం అంటే అలాగే ఉంటుంది.
ఇప్పుడు బీసీ యువతపై అదే ట్రాప్ :
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనేది పొలిటికల్ అస్త్రం.దాంతో బీసీల ఓట్లు పొందడా నికి రాజకీయ పార్టీలు ఎవరికి మించిన డ్రామాలు వారు వేస్తారు.అవి సాధ్యమవుతాయా లేదా అన్నది ఎవరికీ తెలియదు.ఇప్పుడు ఉన్న రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదు.ఒక వే ళ ఆ రిజర్వేషన్లు వచ్చినా బీసీలంతా బాగుపడిపోతారని ఎవరూ అనుకోలేరు.70 ఏళ్లుగా రిజర్వేషన్లు ఉన్న వర్గాలేమీ బాగుపడలేదు.కొంత మంది బాగుపడ్డారు.అయినా ప్రాణాలు వదిలేస్తే...రిజర్వేషన్లు వస్తాయని అనుకోడం...ఆ దిశగా యువతను రెచ్చగొట్టి రాజకీ యం చేయాలనుకోవడం అత్యంత ఘోరమైన రాజకీయం.
రాజకీయ నేతలు కాస్త ఆలోచించండి
అర్థం పర్థం లేని కారణాలతో ఆత్మహ త్యలు చేసుకుని పరామర్శించి,ఇంకా రెచ్చగొట్టే ప్ర కటనలు చేయడం వల్ల మరికొంత మంది ఆవేశపడి ప్రాణాలు వదిలితే ఆ పాపం ఊరకనే పోదు.కొన్ని వందల కుటుంబాలు ఇప్పటికీ వేదన పడుతున్నాయి.ఇప్పుడు మరోసారి బీ సీ యువతను ఈ ట్రాప్ లోకి లాగాలని ప్రయత్నించడం బీసీ బిడ్డలపై కుట్ర చేయడమే.అ లాంటి పనులు చేయడం కన్నా రాజకీయాలను వదిలేయడం శ్రేయస్కరం అని ప్రజలు హితవు పలుకుతున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...