నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టివేత...సౌత్ డీఎస్పీ బాణోదయ...
నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి పట్టివేతసౌత్ డీఎస్పీ బాణోదయ
గుంటూరు,పలకలూరు రోడ్ లో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దాడు లు నిర్వహించి ముప్పిరి సుబ్బా రావు (38) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.ఈ మేరకు సౌత్ డీఎస్పీ బాణోదయ వివరాలు వెల్లడించారు.సుబ్బారావు వద్ద నుండి సుమారు నాలుగు కేజీ ల గంజాయి స్వాధీనం చేసుకున్నాం.సుబ్బారావు కూలిపనులు చేసుకుంటూ జీవనం సా గిస్తున్నాడు...గంజాయి అమ్మితే డబ్బులు ఎక్కువ వస్తూ ఉండటంతో గంజాయి ఒరిస్సా నుండి తెచ్చి విక్రయిస్తున్నాడని అన్నారు.నిందితుడికి సహాయం చేస్తున్న మరియు గంజా యి వినియోగిస్తున్న మరో ఎడుగురిని కూడా అరెస్ట్ చేశామన్నారు.అరెస్ట్ చేసిన వారిలో ఐదు మందిపై హత్యయత్నం,హత్యకేసులలో రౌడీషీట్లు తెరవబడి ఉన్నాయన్నారు.నింది తుడుకి గంజాయి సేవించే అలవాటు ఉండటంతో అతను సేవించడానికి తెచ్చుకొని,దాని లో కొంత భాగం గంజాయిని బయట వ్యక్తులకు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు.గంజాయి మొత్తని ఒరిస్సాలోని అల్సంధాపూర్ అనే చోట నుండి కిలో రూ.2000 రూపాయలకు కొనుగోలు చేశాడు.గంజాయి సప్లై చేసే వారిపై నిఘా పెంచాం...గంజాయి విక్రయించిన ఎవరైనా వాడిన చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని వారు తెలిపారు.
Comments
Post a Comment