స్క్రబ్ టైఫస్ వ్యాధి మనిషి నుండి మనిషికి వ్యాపించదు...ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...

స్క్రబ్ టైఫస్ వ్యాధి మనిషి నుండి మనిషికి వ్యాపించదు
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :
స్క్రబ్ టైఫస్ వ్యాధి మనిషి నుండి మనిషికి వ్యాపించదని,ప్రజలు భయప డాల్సిన అవస రం లేదని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి వైద్య బృందంతో సమీక్ష నిర్వహించారు.ఈ సం దర్భంగా వ్యాధి వ్యాప్తి గురించి కలెక్టర్ ఆరా తీశారు.నవంబర్ నెల,ఈ రోజు వరకు 44 పాజిటివ్ కేసులు వచ్చాయని,అందరికీ చికిత్స అందించామని,39మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారని,ప్రస్తుతం ఐదు మంది ఆసుపత్రిలో ఉన్నారని జీజీహెచ్ సూప రింటెండెంట్ వి వరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవ సరం లేదని,అప్రమ త్తంగా ఉంటే సరిపోతుందన్నారు.ఈ వ్యాధి తీవ్రమైనది కాదని,తక్షణ చికిత్సతో పూర్తిగా నయం అవుతుందని తెలిపా రు.ఒరియెంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని తెలిపారు.మైట్ అనే కీటకం కాటు వల్ల ఈ వ్యాధి వస్తుంద ని,ఏదైనా కాటు కనిపించిన వెంటనే సమీపంలోని స్థానిక పిహెచ్ సి,యుపిహెచ్ సికి వెళ్లి చికిత్స పొందాలని కలెక్టర్ సూచించారు.అధిక జ్వరం,తలనొప్పి,శరీర నొప్పులు,దద్దు ర్లు,కాటు దగ్గర నల్లరంగు పట్టు (ఎస్కార్) లక్షణాలు ఉంటాయని అన్నారు.జిజిహెచ్ క ర్నూలులో పరీక్ష చేసి కన్ఫర్మేషన్ చేసి,చికిత్స చేస్తారని తెలిపారు.రైతులు పొలాల్లో,పొ దల్లో ఉన్నపుడు జాగ్రత్తగా ఉండాలని,పూర్తిగా ఒంటిని కప్పే ఫుల్ షర్టులు,వ్యవసాయం లో ఫుల్ రబ్బరు బూట్లు, ప్యాంట్ లు ధరించాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశం లో జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు,జనరల్ మెడిసిన్ హెచ్.ఓ.డి.డాక్టర్ శ్రీ రాములు,చిన్నపిల్లల విభాగపు హెచ్.ఓ.డి.డాక్టర్ విజయనంద్ బాబు,పల్మనాలజీ హెచ్. ఓ.డి డాక్టర్ శ్రీకాంత్,జిల్లా ఇమ్యూనిజేషన్ అధికారి డా.ఉమాదేవి,ఇతర వైద్య బృందం పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...