అహార నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి...అన్న క్యాంటీన్లను కమిషనర్ పి.విశ్వనాథ్ అకస్మిక తనిఖీ...

అహార నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
మరింత స్వచ్ఛత, సౌకర్యాలు మెరుగుపరచాలి
అన్న క్యాంటీన్లను కమిషనర్ పి.విశ్వనాథ్ అకస్మిక తనిఖీ

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరంలోని అన్న క్యాంటీన్లలో అహార నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటిం చాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ నిర్వాహకులకు ఆదేశించారు.శనివా రం ఆయన కొండారెడ్డి బురుజు,కలెక్టరేట్ అన్న క్యాంటీన్లను అకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార నాణ్యత,పరిసరాల పరిశుభ్రత,నీటివసతి,సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత,విని యో గించే పదార్థాల నిల్వ విధానాలను సమగ్రంగా పరిశీలించారు.అనంతరం రిజిస్టర్‌లో సం తకం చేసి రిమార్క్స్ నమోదు చేశారు.ఆహార నాణ్యతను ప్రతిరోజు పరిశీలించి తన దృ ష్టికి తీసుకోరావాలని నోడల్ అధికారులను ఆదేశించారు. సంబంధిత పారిశుద్ధ్య తనిఖీ దారుడు ప్రతి రోజూ విధిగా స్వచ్ఛత పనులు చేపట్టాలని సూచించారు.ఈ సందర్భంగా క మిషనర్ మాట్లాడుతూ...అన్న క్యాంటీన్లలోఎఫ్‌యస్‌యస్ఏఐ నియమాలు తప్పనిసరి గా అమలు చేయాలని కమిషనర్ సూచించారు.రోజువారీ వంట ప్రక్రియలో ఉపయోగించే ముడి పదార్థాలు తాజాగా ఉండాలని,పాతవి వెంటనే తొలగించాలని తెలిపారు.వంటశా లలో పాత్రలు,వంట సామగ్రి,ప్లేట్లు,గ్లాసులు ప్రతి వాడుకకు ముందు,తరువాత సమ గ్రంగా శుభ్రం చేయడం అనివార్యమని పేర్కొన్నారు.శుద్ధి చేసిన నీటినే వంటకు, తాగడానికి ఉ పయోగించాలని,నీటి నాణ్యత పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని చెప్పారు. సిబ్బంది చేతి పరిశుభ్రత, గ్లౌవ్స్,క్యాప్,హెయిర్‌నెట్ వంటి భద్రతా ప్రమాణా లను విధిగా పాటించాలన్నారు.వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కూర్చునే సౌక ర్యా లు,నీటి సదుపాయాలు,పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.మెనూలో పో షకాహార ప్రాధాన్యత ఉన్న పదార్థాలను మాత్రమే అందించడంపై క్యాంటీన్ నిర్వాహకులు దృష్టి పెట్టాలని కమిషనర్ సూచించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...