విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలి..జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...

విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఉపాధ్యాయులు,విద్యార్థులు,తల్లిదం డ్రుల మధ్య 
సుస్థిర సమన్వయానికి మెగా పీటీఎం–3.0
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని
వాటి సాధనకు కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని,ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లి దండ్రుల మధ్య సుస్థిర సమన్వయం కోసం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ –3.0 ఏర్పా టు చేసిందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.శుక్రవారం కల్లూరు మండలం, కల్లూ రు గ్రామం,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటిం గ్ 3.0 కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.పండుగ వాతావరణంలో ఈ కార్య క్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులను కలెక్టర్ తిలకించి,అభినందించారు.సేంద్రీయ వ్యవసాయం,రిచ్ విటమిన్ గార్డెన్,పునరు త్పాదక ఇంధన పార్క్,వాక్యూమ్ క్లీనర్ తదితర సైన్స్ ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్ లను పరిశీలిం చి,విద్యార్థులు వివరిస్తున్న తీరును కలెక్టర్ అభినందించారు.నిత్య జీవితంలో ఈ ప్రాజెక్టు లను ఎలా ఉపయోగించాలి అని తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. 
అనంతరం విద్యార్థుల నృత్యాలు,బాల్య వివాహాల నివారణపై వేసిన విద్యార్థులు ప్రదర్శిం చిన నాటికలను వీక్షించారు.అనంతరం సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు ఆత్మ విశ్వాసం,పట్టుదల,క్రమశిక్షణ పట్ల స్పూర్తి కలిగించేలా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మా ట్లాడారు.విద్యా ర్థులందరూ ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని,లక్ష్య సాధన వైపు కృషి చేయాలని సూచించారు.నేను కూడా చదువు మీదే దృష్టి పెట్టి రోజుకు 14 గంట లు చదివి మెడిసిన్ (MBBS) సీటు సాధించాను.తర్వాత గ్రూప్–1 పరీక్షల్లో విజ యంతో నేడు జిల్లా కలెక్టర్‌గా మీ ముందున్నాను.నాకు ఈ స్థాయి రావడానికి నా తల్లి దండ్రుల ప్రోత్సాహం,గురువుల మార్గదర్శకత,కష్టపడి చదివిన శ్రమ కారణం అని ఆమె విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా చదువును విడిచిపెట్ట కూడదని,ఏ సబ్జెక్టు పట్ల భయం ఉంటే అదే సబ్జెక్టులో ఎక్కువగా సాధన చేసి ఆ విష యంపై పట్టు సాధించాలని సూచించారు.
భయపడే సబ్జెక్టును బలహీనతగా కాకుండా అవకాశంగా తీసుకుని,ఆ సబ్జెక్టులో మాస్టర్ గా కావడానికి సంకల్పించండి అని ఆమె విద్యార్థులను ప్రోత్సహించారు.పిల్లలు ఎప్పు డూ ఆనందంగా,సానుకూల ఆలోచనలతో ఉండాలని,ఇతరులకు సహాయం చేసే మన స్తత్వం పెంచుకోవాలని,తల్లిదండ్రులు పిల్లలతో సాన్నిహితంగా ఉండి,వారి విద్యాభ్యా సా న్ని నిరంతరం ప్రోత్సహించాలని ఆమె సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల కు నాణ్యమైన విద్య అందించే విధంగా చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో పదవ తరగతి ఫలితాలు మెరుగుపరచడం లక్ష్యంగా రేపటి నుంచే 100 డేస్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నామన్నారు.ప్రతి రోజు ఒక సబ్జెక్టుకు సంబంధించిన బోధ న అనంతరం విద్యార్థులకు 20మార్కుల పరీక్షలు నిర్వహించి సాయంత్రం 5.00గంట లలోపు స్కాన్ చేసి జిల్లా కేంద్రానికి అప్‌లోడ్ చేసే విధంగా చర్యలు చేపట్టినట్టు వివ రించారు.
ఉపాధ్యాయులు,విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా అమలు చేసి ప్రతి విద్యార్థి హాజరును నిర్ధారించాలని,విద్యార్థులు తమ చదువును రోజువారీ ప్రణాళికతో కొనసాగించాలని ఆమె సూచించారు.100 రోజుల ప్రణాళికను సద్వినియోగం చేసు కొని ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాన్ని సాధించాలని,ఇది మీ భవిష్యత్తులో ఒక పెద్ద మలు పు అవుతుందని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.జిల్లాలో విద్యావ్యవస్థను మరింత అభివృద్ధి పరచడం,విద్యార్థులు శాస్త్రీయంగా ఆలోచించే విధానాన్ని పెంచడం,బోధన–అభ్యసనంలో నాణ్యత తీసుకురావడం కోసం గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్ట ర్ తెలిపారు.తదనంతరం జిల్లా కలెక్టర్,అధికారులు,విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భో జనం చేశారు.పక్కనే భోజనం చేస్తున్న విద్యార్థిని యోగ క్షేమాలను అడిగి తెలుసుకు న్నారు.బాగా చదువుకోవాలని సూచించారు.అంతకుముందు జిల్లా విద్యా శాఖాధికారి, మండల విద్యాశాఖాధికారి,పాఠశాల హెడ్మాస్టర్ విద్యాభివృద్ధి,వంద రోజుల యాక్షన్ ప్లా న్ గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి శామ్యూల్ పాల్, స్టేట్ ఎడ్యుకేషన్,ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ నాగమణి,మండల విద్యాశాఖాధికారి వనజ,తహ శీల్దార్ ఆంజనేయులు,పాఠశాల చైర్మన్ మహబూబ్ బాషా,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...