కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలి... జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...

కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలి
మున్సిపల్ కమిషనర్,అధికారులతో సమీక్ష
మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం
కేంద్ర,రాష్ట్ర పథకాల సమర్థ వినియోగం
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేం దుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని జి ల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో మున్సిపల్ కమిషనర్,ఇంజనీరింగ్,పట్టణ ప్రణాళిక విభాగాల సిబ్బందితో కర్నూ లు స్మార్ట్ సిటీ అంశంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.నగర అభివృద్ధికి అవసరమైన దీర్ఘ కాలిక ప్రణాళికలు,అమలు విధానాలు,మౌలిక వసతుల విస్తరణపై కలెక్టర్ దృష్టిసారించా లని సూచించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించి త్రాగు నీటి నిరంతర సరఫరా,అండర్‌ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ,పచ్చదనం పెంపు,పార్కులు,రవాణా వ్యవస్థ,ఔటర్ రింగ్ రోడ్,ఫ్లై ఓవర్లు,కేసీ కెనాల్,తుంగభద్ర,హంద్రీ నదుల పరిశుభ్రత వంటి అంశాలను ప్రణాళికల్లో చేర్చాలని సూచిం చారు.జలశక్తి,అమృత్,పీఎం గతిశక్తి,స్వచ్ఛభా రత్,స్వదేశ దర్శన్,నేషనల్ గ్రీన్ ఎయిర్ వంటి కేంద్ర పథకాల నుండి నిధులు పొందేలా శాఖల సమన్వయంతో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పం పాలని సూచించారు.
మార్చి నెలాఖరులోపు అన్ని డీపీఆర్‌లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కు దిశానిర్దేశం చేశా రు.ప్రణాళికల రూపకల్పనలో మంత్రి టీజీ భరత్,ఇన్‌చార్జి మంత్రి, పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు సూచనలను కూడా తీసుకో వాలని కలెక్టర్ తెలిపారు.ఈ సమావే శంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనా థ్,ఇన్‌చార్జి సిటీ ప్లానర్ వెంకట రమణ,టీపీ ఎస్ అంజాద్ బాషా,డీఈలు గిరిరాజ్,పవన్, కుమార్ రెడ్డి,శ్రీనివాసన్,అసిస్టెంట్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...