గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు...కోవ్‌స్టేస్ హోటల్‌లో 12మంది అరెస్ట్...
గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు
కోవ్‌స్టేస్ హోటల్‌లో 12మంది అరెస్ట్
నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో భారీ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కోవ్‌స్టేస్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తు న్నారన్న నమ్మదగిన సమాచారంతో ఈగ ల్ విభాగం,పోలీస్ అధికారులు సంయు క్తంగా దాడులు నిర్వహించారు.ఈ సోదా ల్లో డ్రగ్స్ పార్టీకి సంబంధించిన మొత్తం 12మందిని పోలీసులు అదుపులోకి తీసు కున్నారు.వీరిలో ఐదుగురు డ్రగ్స్ తీసు కున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యిం దని అధికారులు వెల్లడించారు.ఘటనా స్థలంలో నుంచి డ్రగ్స్ నమూనాలను స్వా ధీనం చేసుకున్నట్లు సమాచారం.అంతేకా కుండా,ఈ డ్రగ్స్ పార్టీలో పోలీసు శాఖకు చెందిన ఓ అధికారి కూడా ఉన్నట్లు సమా చారం రావడంతో కేసు మరింత సంచల నంగా మారింది.సంబంధిత అధికారి పాత్ర పై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు లు తెలిపారు.డ్రగ్స్ సరఫరా చేసిన వారె వరు?, ఈ పార్టీల వెనుక ఉన్న నెట్‌వర్క్ ఏమిటన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగు తోంది.గచ్చిబౌలి,ఐటీ కారిడార్ ప్రాంతాల్లో డ్రగ్స్ నియంత్రణకు మరింత కఠిన చర్య లు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Post a Comment