బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో మంత్రి సవిత మ్మ సమీక్ష...ఆదరణ–3,బీసీలకు 34శాతం రిజర్వేషన్,కులదూషణ పదాలపై చట్టం,కీలక ప్రక టనలు...

బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో మంత్రి సవితమ్మ సమీక్ష
ఆదరణ–3,బీసీలకు 34శాతం రిజర్వేషన్,
కులదూషణ పదాలపై చట్టం,కీలక ప్రకటనలు
VS9TV న్యూస్,విజయవాడ :

విజయవాడ,గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్ నందు బీసీ సంక్షేమ మంత్రి యస్.సవితమ్మ ఆధ్వర్యంలో అన్ని బీసీ కార్పొరేషన్ల చైర్మన్లతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వ హించారు.ఈ సమావేశంలో బీసీల అభివృద్ధికి ప్రభుత్వం రాబోయే కాలంలో అమలు చే యనున్న పథకాలపై విస్తృతంగా చర్చించారు.ముఖ్యంగా ఆదరణ–3 పథకం ద్వారా చే తివృత్తుల వారికి అవసరమైన పనిముట్లు,సబ్సిడీ రుణాలు అందించ నున్నట్లు తెలిపారు.
అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభు త్వం సుముఖంగా ఉందని వెల్లడించారు.బీసీలను సామాజికంగా కులదూషణ చేసే వి ధంగా వాడుక భాషలో ఉన్న కించపరిచే పదాలను నిషేధించేందుకు త్వరలో ప్రత్యేకం గా బీసీ చట్టాన్ని తీసుకురానున్నట్లు,ముఖ్య మంత్రి నారాచంద్రబాబు నాయుడు ఈ అం శాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకొని బీసీల గౌరవ మర్యాదలు కాపాడేందుకు ముం దుండనున్నారని తెలియజేశారు.అటువంటి పదాలను నిషేధిత జాబితాలో చేర్చేందుకు ప్ర భుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ మాట్లాడుతూ బీసీ జనగణన కార్యక్రమంలో పంచ వృత్తుల వారిని ఒకే కులంగా భావించి విశ్వబ్రాహ్మ ణులుగా నమోదు చేయాలని ఆమె సూచించారు.అలాగే స్వర్ణకారులపై నమోదు అవుతున్న దొంగ బంగారం కేసులలో జి.ఓ.నెంబర్ 272ను సవరించి,స్వర్ణకారులను కేసుల నుండి విముక్తి చేయాలని కోరా రు.విశ్వబ్రాహ్మణులను కులదూషణ చేస్తూ “చారి, పప్పు చారి” వంటి పదాలు వాడుతు న్న వారిపై క్రిమి నల్ కేసులు నమోదు చేసి విశ్వబ్రాహ్మణుల గౌరవ మర్యాదలు కాపాడా లని ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ డి మాండ్ చేశారు.అనంతరం విశ్వబ్రాహ్మణుల సమస్యలపై మొత్తం 23అంశాలతో కూడిన సవివర వినతి పత్రాన్ని మంత్రి యస్.సవితమ్మకి సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఏపీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ తునికి పాటి శివ,ఎన్టీఆర్ జిల్లా వి శ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బ్రహ్మశ్రీ డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ ఎం.డి.తదిత రులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...