విలాసాలకు అప్పులు చేసిన ప్రేమ జంట.... పోలీసుల వలలో కటాకటాలు లెక్కించారు...

విలాసాలకు అప్పులు చేసిన ప్రేమ జంట
పోలీసుల వలలో కటాకటాలు లెక్కించారు
VS9TV న్యూస్,విజయనగరం :
ఉద్యోగాలు ఉన్నప్పటికీ,విలాసాల కోసం జీతాలు సరిపోక,అప్పులు చేసి పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగి దొంగతనాలకు ది గింది ఓ ప్రేమ జంట.చివరకు పోలీస్ వ ల కు చిక్కారు.దేశవ్యాప్తంగా పలు ప్రాంతా లకు మకాం మారుస్తూ తప్పించుకునే ప్ర యత్నంలో చివరకు భువనేశ్వర్‌లో అడ్డం గా దొరికిపోయారు.విజయనగరం జిల్లా లో జరిగిన ఓ ప్రేమజంట నేర ప్రవృత్తి కల కలం రేపుతుంది...వివరాలు ఇలా ఉన్నా యి...బాపట్ల జిల్లా,చీరాల మండలం,వై కుంఠపురం గ్రామానికి చెందిన దుడ్ల బా లాజీ అనే యువకుడు గతేడాది ఉపాధి కోసం రాజాం వచ్చి ఓ ప్రైవేట్ సంస్థలో ఉ ద్యోగిగా చేరాడు.అప్పటికే అదే సంస్థలో పనిచేస్తున్న రేగిడి మండలం,బాలకవివ లస గ్రామానికి చెందిన డోల గాయత్రితో పనిచేస్తున్న సంస్థలోనే పరిచయం ఏర్ప డింది.కొద్దిరోజులకు పరిచయం ప్రేమ వి వాహంగా మారింది.పెళ్లి అనంతరం ఇద్ద రూ బాలకవివలస గ్రామంలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు.ఈ క్రమం లోనే స్తోమతను మించి విలాసవం తమై న జీవనం కోసం అప్పులు చేశారు.అలా కాలక్రమేణా ఆర్థిక సమస్యలు తీవ్రమ య్యాయి.దంపతులకు వచ్చే జీతాలు స రిపోకపోవడంతో అప్పుల భారం పెరిగిం ది.ఈ పరిస్థితుల్లో గతేడాది డిసెంబర్,4న అదే గ్రామానికి చెందిన కిలారి కమల అనే మహిళ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. లా ఇంట్లో ఉన్న 13తులాల బంగారు ఆభ రణాలను అపహరించారు.అనంతరం చోరీ చేసిన బంగారంలో కొంత భాగాన్ని బాపట్ల జిల్లా,చీరాలలో విక్రయించగా,మ రికొంతను శ్రీకాకుళం జిల్లా ఆమదాలవల సలోని ఓ ఫైనాన్స్ సంస్థలో రూ.11 లక్షల కు కుదువ పెట్టారు.తరువాత ఆ మొత్తం తో సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అప్పులు తీర్చారు.మిగిలిన డబ్బు తో గ్రామాన్ని విడిచి పారిపోయారు.అలా గ్రామం విడిచి ఢిల్లీకి వెళ్లి స్థిరపడాలనే ఉ ద్దేశంతో ముందుగా హైదరాబాద్,అక్కడి నుంచి గోవా వెళ్లారు.అక్కడ జీవనోపాధి మార్గాలు దొరకకపోవడంతో చివరకు భు వనేశ్వర్‌లో మకాం వేశారు.అయితే తన ఇంట్లో బంగారం పోయిందని బాధితురా లు కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు రా జాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు ప్రారంభించారు.తరువాత నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యా యి.క్రైం సిబ్బంది సహకారంతో హైదరా బాద్,గోవా,భువనేశ్వర్ ప్రాంతాల్లో గాలిం పు చర్యలు చేపట్టారు.నిందితుల కదలి కలను భువనేశ్వర్‌లో గుర్తించిన పోలీసు లు అక్కడి పోలీసుల సహకారంతో బాలా జీ,గాయత్రిలను అదుపులోకి తీసుకున్నా రు.వారి నుంచి లక్ష నగదు,తన నాలుగు నెలల బిడ్డ కోసం కొనుగోలు చేసిన బంగా రు చైన్ తో పాటు నిందితులు ఉపయో గించిన రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.కుదువ పెట్టిన బంగారాన్ని ఇంకా రికవరీ చేయాల్సి ఉందని పోలీసు లు తెలిపారు.అయితే నిందితులపై గతం లో ఎలాంటి నేర చరిత్ర లేదని,గాయత్రి గతంలో కుటుంబ సభ్యులు,బంధువుల ఇళ్లలో చిన్నపాటి చోరీలు చేసి తిరిగి వా టిని ఇచ్చే అలవాటు ఉండేదని సీఐ వెల్ల డించారు.కమల ఇంట్లో దొంగతనం అనం తరం గ్రామం విడిచి వెళ్లడంతో అనుమా నం బలపడిందని తెలిపారు.ఈ కేసును సమర్థంగా ఛేదించిన రేగిడి ఎస్ఐ బాల కృష్ణతో పాటు క్రైం సిబ్బందిని సీఐ ఉపేం ద్రరావు అభినందించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....