న్యూ ఇయర్,సంక్రాంతి పర్వదినాలను పురస్క రించుకొని విజయవంతంగా ఆర్చరీ ఛాంపి యన్‌షిప్ ముగింపు...

న్యూ ఇయర్,సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని విజయవంతంగా ఆర్చరీ ఛాంపియన్‌షిప్ ముగింపు
VS9TV న్యూస్,కర్నూలు స్పోర్ట్స్ :
జ్ఞాని ఆర్చరీ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఆదర్శ విద్యా మందిర్ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఆర్చరీ ఛాంపియ న్షిప్ నిర్వహించారు.ఈ పోటీల్లో వివిధ పాఠశాలల నుంచి దాదాపు 50నుంచి 60 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.కార్యక్రమానికి ఆదర్శ విద్యా మందిర్ హైస్కూల్ డైరెక్టర్ డాక్టర్ హరి కిషన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ గెలుపు–ఓటములు సహ జమే,కానీ క్రీడాస్ఫూర్తి మరియు క్రమశి క్షణే నిజమైన విజయం అని తెలిపారు. క్రీడాకారులు క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా బలంగా ఎదగాలని సూ చించారు.పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు డాక్టర్ హరికిషన్ చేతుల మీదుగా మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి,ఆర్చరీ కోచ్ ఎం.భరత్ కుమార్,వజ్ర రాజు,జాయింట్ సెక్రటరీ శ్రీరాములు,వ్యా యామ ఉపాధ్యాయుడు మౌలాలి, క్రీడా కారుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమా న్ని విజయవంతం చేశారు.ఈ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ యువ క్రీడాకారుల్లో క్రీడా పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషించిందని నిర్వాహకులు తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...