నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి...
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ,శాంతిభ ద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధి కారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు,నేరచరిత్ర గలవారికి,చెడు నడత కలిగిన వ్యక్తులకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వ హించారు.సత్ప్రవర్తనతో జీవించాలని,నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని,చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు దూరంగా ఉండాలని సూచించా రు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠినచర్యలు తీసు కోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.
Comments
Post a Comment