మాజీ పార్లమెంట్ సభ్యులు టి.జి.వెంకటేష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న డాక్టర్ అరుణ్ కుందవరం...ఉచిత హోమియో మందులు పంపిణీ...

మాజీ పార్లమెంట్ సభ్యులు టి.జి.వెంక టేష్ చేతుల మీదుగా అవార్డు అందు కున్న డాక్టర్ అరుణ్ కుందవరం
ఉచిత హోమియో మందులు పంపిణీ
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
సంపాదన కన్నా సేవాగుణం ప్రాధన్యతగా వైద్య చికిత్స అందచేస్తున్న డాక్టర్ అరుణ్ కుందవరంకు అరుదైన గౌరవం దక్కింది. కౌన్సిల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మె డిసిన్స్ ఢిల్లీ వారి ద్వారా హానరరీ డాక్టరే ట్ ఇన్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అవార్డు అందుకున్నారు.ఈ మేరకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం,రెవెన్యూ భవన్ లో ఆదివారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ అయిన చక్రవర్తి అధ్యక్షతన అ భినందన కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యు లు టీ.జీ.వెంకటేష్, గుంటూరు సిఎన్సిటి వర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఏజెసి శోభన్ బా బు,జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరిం గ్ కమిటీ సభ్యులు సురేందర్,ఎస్టీబీసీ క ళాశాల ప్రిన్సిపాల్ సునీత రోజ్ లిటిల్, ఫ్లాక్ ట్రస్ట్ ఫౌండర్,డైరెక్టర్ జి.బి.ప్రవీణ్ కు మార్ లు హాజరయ్యారు.ముందుగా టీజీ వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిం చారు.అనంతరం టీజీ వెంకటేష్ మాట్లా డుతూ అవార్డు గ్రహీత డాక్టర్ అరుణ్ కుందవరం ఎంతోకాలంగా తనకు పరిచ యమైన వ్యక్తి అని తెలిపారు.తన తల్లికి అనారోగ్యంగా ఉన్నప్పుడు అరుణ్ వై ద్యం చేశారని తెలియజేశారు.డాక్టర్ అరు ణ్ కుందవరం సంపాదన కన్నా సేవా గు ణాన్ని అలవరచుకున్న వ్యక్తి అని కొని యాడారు.సేవ చేయడం అనేది సామా న్యమైన విషయం కాదు అది త్యాగంతో కూడుకున్నది.స్వార్థం లేకుండా ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా చేసేది నిజమై న సేవ అని తెలియజేశారు.అలాంటి ని స్వార్థమైన సేవ అరుణ్ లో గమనించాన ని కొనియాడారు.ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ సంపాదన లో కొంతవరకైనా ఇతరులకు సహాయ ప డాలనే ఆలోచనతో ముందుకు వెళ్లాలని తెలియజేశారు.మన పొరుగు వారికి ఎ ప్పుడైతే మనం సహాయం చేస్తామో అ ప్పుడే దేశం బాగుపడుతుంది.చాలా మం ది పొరుగు వారికి సహాయం చేయరు కా నీ దేశం గురించి దేశ సేవ గురించి మాట్లా డటం ఇది ఎంత మాత్రమూ సరైనది కాదు అని అన్నారు.డాక్టర్ అరుణ్ కుందవరం తన పరిశోధనలకు ఢిల్లీలో అందుకోవాల్సిన అవార్డును తన ప్రాం తంలో తన ప్రజలు,కుటుంబ సభ్యుల మధ్యలో అందుకోవాలని ఆశించడం చాలా గొప్ప విషయం అన్నారు.ఇలాంటి అరుదైన అవార్డును కైవసం చేసుకున్న డాక్టర్ అరుణ్ కుందవరం మన కర్నూలు పట్టణ నివాసి కావడం మన ప్రాంతానికి ఎంతో గర్వకారణం అని తెలియజేశారు. భవిష్యత్తులో డాక్టర్ అరుణ్ తన సేవల ను మరింత విస్తృత పరచాలని సూచిం చారు.డాక్టర్ అరుణ్ కుందవరం మాట్లా డుతూ ఆలోపతి ఆయుర్వేదం,హోమి యో గురించి చాలామందికి సరైన అవ గాహన లేదని అన్నారు.ఏ మెడిసిన్ ను తక్కువగా చూడకూడదని,అవసరాన్ని బట్టి ఉపయోగించాలని తెలిపారు.అత్య వసర పరిస్థితులలో ఆల్లోపతి మాత్రమే పనిచేస్తుందని చెప్పారు.జబ్బును బట్టి మనం వైద్యం చేయించుకోవాలని తెలి యజేశారు.అదేవిధంగా హోమియోపతి లో ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు అని పేర్కొన్నారు.ఎలాంటి ఆపరేషన్లు స ర్జరీలు లేకుండా పూర్తిగా నయం చేయ డం హోమియోపతిలో జరుగుతుందన్నా రు.ఇంటిగ్రిటీ మెడిసిన్ పరిశోధనలకు గా ను తనకు ఈ అవార్డు వచ్చిందని చెప్పా రు. అవార్డును తన ప్రాంతంలో తన సొం త ప్రజల మధ్యలో కుటుంబ సభ్యుల సమక్షంలో మరి ముఖ్యంగా టీజీ వెంక టేష్ చేతుల మీదుగా అవార్డు అందుకో వాలని ఆశించినట్లుగా తెలియజేశారు. 
టీజీ వెంకటేష్ నాకు రోల్ మోడల్ అని, తనకు నేను చాలా పెద్ద అభిమానిని అని డాక్టర్ కొనియాడారు.కార్యక్రమానికి విచ్చేసిన నేపథ్యంలో టీజీ వెంకటేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.శోభన్ బాబు మాట్లాడుతూ డాక్టర్ అరుణ్ చక్కటి హో మియో మందులు పంపిణీ చేస్తున్నారని, ఆయనను కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని కొనియాడారు.ఎస్.టి. బి.సి కళాశాల ప్రిన్సిపాల్ సునీత రోజ్ మాట్లాడుతూ డాక్టర్ అందుకున్న నేషన ల్,ఇంటర్నేషనల్ అవార్డుల గురించి డాక్ట ర్ రచించిన పుస్తకాలను గురించి పరిచ యం చేశారు.లిటిల్ ఫ్లాక్ ట్రస్ట్ సెక్రటరీ నీ లిమ మాట్లాడుతూ డాక్టర్ అరుణ్ కు పేదల పట్ల జాలి,ప్రేమ ఉన్నాయని,నిస్వా ర్థంగా పేదలకు సేవ చేసే గొప్ప మనసు గలవాడని కొనియాడారు.గతంలో చాలా ప్రాంతాల్లో పోలీస్ శాఖ,పారిశుద్ధ్య కార్మి కులు,హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు,వృద్ధులు,అనాధలకు ఆయన ఉ చితంగా హోమియో మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.లిటిల్ ఫ్లా క్ ట్రస్ట్ ఫౌండర్ మరియు డైరెక్టర్ జి.బి.ప్ర వీణ్ కుమార్ మాట్లాడుతూ గడచిన 14 సంవత్సరాలుగా డాక్టర్ అరుణ్ కుందవ రంతో కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేప ట్టడం జరుగుతుందన్నారు.భవిష్యత్తులో కూడా ఇలాంటి చాలా కార్యక్రమాలు నిర్వ హిస్తామని తెలిపారు.తదనంతరం 18 సీజనల్ వ్యాధులు రాకుండా నివారణగా 
ఉచిత హోమియో మందులు పంపిణీ చే యడం జరిగింది.ఈ కార్యక్రమంలో రెవి న్యూ శాఖ,జర్నలిస్టులు వీఆర్వో,ఎన్జీఒ లు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....