జిల్లా అధికారుల నిర్లక్ష్యమే వలసలకు కార ణం...కలెక్టర్ ముందస్తు చర్యలు శూన్యం... ఎస్ఎఫ్ఐ...

జిల్లా అధికారుల నిర్లక్ష్యమే వలసలకు కారణం
10,500 విద్యార్థులు వలసబాట
కలెక్టర్ ముందస్తు చర్యలు శూన్యం
ఎస్ఎఫ్ఐ

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
కర్నూలు జిల్లా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జిల్లాలో 10,500 మంది విద్యార్థులు వ లస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యం.రంగప్ప గురువారం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక ప్రకటనలో తీవ్రంగా విమర్శించా రు.రాయలసీమ జిల్లాల్లో కర్నూలు జిల్లా ఇప్పటికే 90శాతం వలస ప్రభావిత ప్రాంతంగా ఉన్నప్పటికీ,రాష్ట్ర ప్రభుత్వం,జిల్లా యంత్రాంగం వలసలను అరికట్టేందుకు ముందస్తు ని వారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని వారు తెలిపారు.జిల్లాలో 1 0,500 మంది విద్యార్థులు వలస వెళ్లారని జిల్లా కలెక్టర్ ప్రకటన నుంచే అధికారుల నిర్ల క్ష్యం స్పష్టంగా అర్థమవుతోందన్నారు.కర్నూలు జిల్లాలో పదోతరగతి చదువుతున్న విద్యా ర్థులకు 100శాతం హాజరు తప్పనిసరి అంటూ జిల్లా కలెక్టర్ సిరి గోనెగండ్ల పాఠశాలలో తనిఖీ చేసిన సందర్భంగా ఇచ్చిన ఒక పత్రికా ప్రకటనలో జిల్లావ్యాప్తంగా 10,500 మంది విద్యార్థులు వలస వెళ్లగా,అందులో 9,000మందిని తిరిగి రప్పించామని చెప్పడం జరి గింది.అయితే విద్యార్థులు వలస వెళ్లడానికి ప్రధాన కారణం విద్యాశాఖపై జిల్లా అధికారు లు సరైన దృష్టి పెట్టకపోవడమేనని స్పష్టం చేశారు.జిల్లాలో విద్యార్థులకు సరైన వసతి సౌకర్యాలు,హాస్టళ్లు,భోజనం,విద్యావసతులు కల్పించి ఉంటే తల్లిదండ్రులతో కలిసి వలస వెళ్లాల్సిన అవసరం ఉండేదే కాదన్నారు.జిల్లా అధికారుల పూర్తిస్థాయి నిర్లక్ష్యం కారణం గా విద్యార్థులు విద్యకు దూరమై జీవనోపాధి కోసం తల్లిదండ్రులతో పాటు వలస వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.వలసలకు వెళ్లే తల్లిదండ్రులకు బాలల హక్కులు,విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంలో కూడా జిల్లా అధికారులు విఫలమయ్యారని,ఫ లితంగా అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని తెలిపారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని వలసలను అరికట్టేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణా ళిక రూపొందించి,ప్రభుత్వం అందిస్తున్న విద్యా సౌకర్యాలపై విస్తృత ప్రచారం చేయాల ని,వాటి అమలుపై కఠిన పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు,అంజి జిల్లా సహాయ కార్యదర్శి రా ము జిల్లా నాయకులు పృథ్వీ,సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...