దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...నిర్లక్ష్యం వహించకండి,ప్రజల్లో మార్పురావాలి...కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్...

దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నిర్లక్ష్యం వహించకండి,ప్రజల్లో మార్పు రావాలి
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ 

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
పోలీసులు ప్రతి రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.సిసి కెమెరాలు ఏర్పా టు చేసుకుంటే మరి మంచిది.రోజురోజుకూ బంగారం ధరలు గణనీయంగా పెరగడంతో దొంగతనాలకు అవకాశం ఇవ్వకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా గృ హాల్లో బంగారం,విలువైన ఆభరణాలు భద్రంగా ఉంచుకోవాలని లేదంటే బ్యాంకు లాక ర్లలో ఉంచుకోవాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.ఇటీవల చోటుచేసుకుం టున్న దొంగతనాల నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్ర జల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని,ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల భద్రతా చర్యల పట్ల నిర్ల క్ష్యం వహించరాదన్నారు.ఇళ్లలో బంగారు నగలు,నగదు వంటి విలువైన వస్తువులను ని ల్వ ఉంచకుండా సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచాలని,ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పా టు చేసుకోవడం ద్వారా దొంగతనాలను ముందుగానే అరికట్టవచ్చన్నారు.అపరిచిత వ్య క్తులు బంగారంకు మెరుగులు దిద్దుతాం అంటూ ఇళ్లలోకి వచ్చే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.వివాహాలు,శుభకార్యాల సమయం లో బంగారం ఆభరణాలు ధరించినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.గుంపులు గా ఉండే ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ వంటివి జరిగే అవకాశం ఉంటుందని జాగ్రత్తలు తీ సుకోవాలన్నారు.పట్టణ,గ్రామ శివారులలో ఉన్న ఇళ్ళను,ఒంటరి వృధ్ధ మహిళలను ల క్ష్యంగా చేసుకుంటూ టార్గెట్గా రెక్కీ చేస్తూ,చైన్ స్నాచింగ్లు,ఇళ్లల్లో చోరీలు చేసి,నంబ ర్ ప్లేట్లులేని బైకులతో వచ్చి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్తున్నారన్నారు.ఉత్సవాలు,జా తరలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారు నగలు వేసుకొని వెళ్లకండా ఉండడం ఉత్తమమ న్నారు.అపార్ట్ మెంట్లు,ఇళ్ళ వద్ద భద్రతకు సిసిటీవీ అలారాలు ఉంచుకో వడం ఉత్తమమ న్నారు.ఒంటరిగా నడిచేటప్పుడు లేదా ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలన్నారు.అత్యంత విలువైన ఆభరణాలను ఇంట్లో కాకుండా బ్యాంక్ లాకర్లలో దాచుకోవాలన్నారు.ఏదైనా అ నుమానాస్పద వ్యక్తులు కనిపించినా, దొంగతనాల ప్రయత్నాలు గమనించి నా వెంటనే డయల్ 100 / డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని క ర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.ప్రజల సహకారంతోనే నేరాలను అరికట్టడం సా ధ్యమవుతుందని,అప్రమత్తతే భద్రతకు మూలమని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....