అందరి సమ్మతితోనే నాలెడ్జ్ సెంటర్ నిర్మా ణం...డాక్టర్ చిట్టి నరసమ్మ,అడిషనల్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్మెడికల్ ఎడ్యుకేషన్, కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్...
అందరి సమ్మతితోనే నాలెడ్జ్ సెంటర్ నిర్మా ణం
డాక్టర్ చిట్టి నరసమ్మ,అడిషనల్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్మెడికల్ ఎడ్యుకేషన్,కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్
కర్నూలు మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం అల్యూ మిననీ ఆధ్వర్యంలో రూ.50కోట్లతో నిర్మించతలపెట్టిన మల్టీ యుటిలిటీ సెంట ర్ భవన నిర్మాణం అందరి సమ్మతితోనే చేపట్టడం జరుగుతుందని అడిషనల్ డైరె క్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్,కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.చిట్టి నర్సమ్మ అన్నారు.శుక్రవారం తనను కలి సిన ఏపీజీడిఏ నాయకులు విద్యార్థులతో వారు మాట్లాడుతూ గత నెల 26వ తే దీన గౌరవ మంత్రి ఆధ్వర్యంలో కాలేజీలో జరిగిన సమావేశంలో గతంలో గ్రౌండ్ లో నిర్మాణంపై ఏర్పడిన వివాదం పరిష్క రించేందుకు గ్రౌండ్ యందు కాకుండా గ్రౌం డ్ కు ఇబ్బంది లేకుండా మల్టీ యుటిలిటీ భవన నిర్మాణానికి అందరి సమక్షతోనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.ఈ భవన నిర్మాణంపై ఏపీజిడిఏ కాలేజీ వి ద్యార్థులు కుంకోసా భవనానికి ఇబ్బం దు లు లేకుండా చూడాలని,మల్టి యుటిలిటీ భవనం ఎవరి నిర్వహణలో ఉంటుందని అడగగా భవనం నిర్వహణ పూర్తిక కాలే జీ ప్రిన్సిపల్ చేతుల్లోనే ఉంటుందని తెల పడం జరిగింది.ఇప్పటికే ఈ అంశంపై చాలాసార్లు చర్చలు జరిగాయని గ్రౌండ్ కు ఇబ్బంది లేకుండా నిర్మాణం అంటేనే మం త్రి ఆధ్వర్యంలో అందరూ ఒప్పుకున్నార ని,ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్రాత పూర్వకంగా ఇవ్వాలని ప్రిన్సిపల్ కోరా రు.గత నెల 26వ తేదీ నిర్ణయం తీసు కోగా ఇంత వరకు ఎటువంటి అభ్యంతరం తెలుపలేదని అన్నారు.ఇప్పుడు కూడా వ్రాతపూర్వకంగా ఇవ్వలేదని,కారణాలు వివరిస్తూ వ్రాత పూర్వకంగా ఉంటేనే పై అధికారులకు తెలియజేయడానికి అవ కాశం ఉంటుందని,కావున ఎటువంటి అ భ్యంతరం అయినా అభ్యంతరానికి గల కారణాలు తెలుపుతూ వ్రాత పూర్వకంగా ఇవ్వాలని ఆమె తెలిపారు.
Comments
Post a Comment