పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం...

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
VS9TV న్యూస్,హైదరాబాద్ :
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక 'పద్మ' పురస్కారాలను ప్రక టించింది.దేశంలోని వివిధ రంగాల్లో విశేష మైన సేవలు అందించిన వ్యక్తులను గుర్తిం చి,వారికి ఈ అవార్డులను అందించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.ఈ క్రమంలో ఈ ఏడాది మొత్తం 45మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.ప్రకటనతో పాటు, ఆయా రంగాల్లో కృషి చేసిన వారి సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మామిడి రామరెడ్డి పేరు చోటు దక్కడం రాష్ట్రానికి గర్వకార ణంగా మారింది.పాడి పరిశ్రమ మరియు పశుసంవర్ధక రంగాల్లో ఆయన చేసిన దీర్ఘకాల సేవలు,రైతులకు అందించిన మార్గనిర్దేశం,అలాగే పశుసంరక్షణలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహించిన కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయ నకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి మెరుగుద లకు ఆయన చేసిన సేవలు ఎంతో కీలకంగా నిలిచాయని అధికారులు పేర్కొన్నారు.అదేవిదంగా తమిళనాడుకు చెందిన నటేశన్ కూడా ఈసారి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.ఆయన తమ రంగంలో చేసిన కృషి,నిరంతర సేవాభావం కారణంగా ఈ గౌరవం లభించినట్లు వెల్లడైంది.అలాగే, హైదరా బాద్‌లోని ప్రముఖ పరిశోధనా సంస్థ సీసీఎంబీ (CCMB)లో పనిచేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజ్‌కు కూడా పద్మశ్రీ అవార్డు వరించింది.జన్యు సంబంధ పరి శోధనల రంగంలో ఆయన చేసిన విశేష మైన అధ్యయనాలు,దేశీయ శాస్త్రీయ పరిశోధనలకు అందించిన సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ విధంగా వివిధ రంగాల్లో సమాజానికి విలువైన సేవలు అందించిన వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాల ద్వారా గౌరవించడం ద్వారా,భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందని విశ్లేష కులు భావిస్తున్నారు.గణతంత్ర దినోత్స వం సందర్భంలో వచ్చిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

ఎంపికైన వారు :

1. అంకె గౌడ (సాహిత్యం - కర్ణాటక)
2. తంగరాజ్‌ (హైదరాబాద్ - CCMB శాస్త్రవేత్త)
3.అర్మిడ ఫెర్నాండెజ్‌ (మహారాష్ట్ర)
4.భగవాన్‌దాస్‌ రాయికర్‌ (మధ్యప్రదేశ్‌)
5.భిక్‌ల్యా లదక్య దిండా
6.బ్రిజ్‌లాల్‌ భట్‌ (జమ్మూ & కశ్మీర్‌)_
7. బుద్రి తాటి
8.చరణ్‌ హెబ్రామ్‌
9.చిరంజి లాల్‌ యాదవ్‌
10.ధార్మిక్‌లాల్‌ చునిలాల్‌ పాండ్య
11.గఫ్రుద్దీన్‌ మెవాటి జోగి
12.హాలీ వార్‌
13. ఇంద్రజిత్‌ సింగ్‌ సింధు
14. కె.పజనీవెల్‌
15. కైలాశ్‌ చంద్ర పంత్‌
16.ఖెమ్‌ రాజ్‌ సుంద్రియాల్‌
17.కొల్లక్కయిల్‌ దేవకి అమ్మ జీ
18.మహేంద్ర కుమార్‌ మిశ్రా
19.మిర్‌ హజీభాయ్‌ కసమ్‌భాయ్‌
20.మోహన్‌ నగర్‌
21.నరేష్‌ చంద్ర దేవ్‌ వర్మ
22.నీలేష్‌ వినోద్‌చంద్ర మండేవాలా
23.నూరుద్దీన్‌ అహ్మద్‌
24.ఒత్తువర్‌ తిరుత్తణి స్వామి నాథన్‌
25.పద్మ గుర్మీత్‌
26.పోహిలా లక్తెపి
27.పుణ్యమూర్తి నటేశన్‌
28.ఆర్‌.కృష్ణన్‌
29.రఘుపత్‌ సింగ్‌
30.రఘువీర్‌ తుకారామ్‌ ఖేద్కర్‌
31.రాజస్తపతి కలిప్ప గౌండర్‌
32.రామకృష్ణారెడ్డి (మామిడి)
33.రామచంద్ర గాడ్‌బోలే - సునీత గాడ్‌బోలే
34.ఎస్‌.జి.సుశీలమ్మ
35.సంగ్యుగామ్‌
36.షఫీ సౌదిక్‌
37.శ్రీరంగ్‌ దేవబాలద్‌
38.ష్యామ్‌ సుందర్‌
39.సింహాచల్‌ పాత్రో
40.సురేశ్‌ హనఘవాడి
41.తాగరామ్‌ భీల్‌
42.తేచి గుబిన్‌
43.తిరువయ్యూర్‌ భక్తవత్సలం
44.విశ్వ బంధు
45.యమున్‌ జాత్రసింగ్‌

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...