రమేష్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిం చాలి..కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ యన్. సి.బజారన్న...

రమేష్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ యన్ సి బజారన్న

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లా,తుగ్గలి మండలం,బొందిమడుగులకు చెందిన ఎంఆర్ పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ పై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ఎన్ సి బజారన్న డిమాండ్ చేశారు.శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాల యం నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు.గత శుక్రవారం బొందిమడుగులలో రమేష్ వాకింగ్ చేస్తుండగా దుండగులు వెనుక నుండి ట్రాక్టర్ తో గుద్ది కిందపడ్డ రమేష్ ను రాడ్లు, కత్తులతో దాడి చేశారని తీవ్రంగా గాయపడిన రమేష్ ను బంధువులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని అన్నారు.నేడు కోలుకోలేక అతను మృతి చెందడం బాధాకరం అని ఆయన కుటుంబ సభ్యులకు జిల్లా కాంగ్రెస్ కమిటీ తమ ప్రగాఢ సానుభూ తిని సంతాపం తెలియజేశారు.రమేష్ అణగారిన వర్గాల సమస్యలపై నిత్యం పోరాటం చే సేవాడని,రమేష్ ఒక ఎంఆర్పిఎస్ నాయకుడే కాకుండా అన్ని వర్గాల ప్రజా సమస్యలపై పోరాడి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించేవాడని చెప్పారు.ఇలాంటి దాడులు కేవలం దళితులపై ఎక్కువగా జరుగుతున్నాయని,ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి దాడులు ఎక్కువయ్యాయని,అదేవిదంగా దళిత మహిళల హత్యలు,అత్యాచారాలు అధి కంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఒక దళిత మహిళ ఆయన హోం మంత్రి గతంలో దళితులకు మహిళలపైన దాడు లు జరగకుండా అండగా ఉంటానని,వారికి రక్షణ కల్పి స్తానని మంత్రి పదవికి న్యాయం చేస్తానని రక్షణ మంత్రి వాగ్దానం చేసిన కూడా ఎక్కువ శాతం ఎస్సీ,ఎస్టీలపై హత్యలు,అత్యాచారాలు,దాడులు జరుగుతున్నాయని అన్నారు.మీ రు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేశారు.అలాగే రమేష్ పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి వారి పైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు న మోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పారు.జిల్లా ఎస్ పి,జిల్లా కలెక్టర్ లు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.మృతి చెందిన రమేష్ కుటుం బానికి ఆర్థిక సహాయం,ప్రభు త్వం తరఫున అన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్య క్రమంలో ఐఎన్టీయూసీ సిటీ అధ్యక్షులు రేపల్లె ప్రతాప్,ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షులు ఈ.లాజరస్ పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...