ప్రియుడు దక్కలేదన్న కక్షతో హెచ్‌ఐవీ ఇంజెక్ష న్‌...డాక్టర్‌ భార్యపై ప్రాణాంతక దాడి చేసిన నర్సు...

ప్రియుడు దక్కలేదన్న కక్షతో హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌
డాక్టర్‌ భార్యపై ప్రాణాంతక దాడి చేసిన నర్సు
కర్నూలులో సభ్య సమాజాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
సినిమా కథను తలపించే ఓ భయానక ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసు కుంది.తెలంగాణ రాష్ట్రం ఇల్లెందులో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సిని మాలో చూపినట్లే,ప్రేమలో విఫలమైన ఓ మహిళ అసూయతో మరో మహిళ ప్రా ణాలపైకి తెచ్చింది.అయితే సినిమాలో తండ్రి పాత్రలో జరిగిన ఘోరం ఇక్కడ ఓ నర్సు చేతుల మీదుగా జరగడం గమనార్హం.కర్నూలు జిల్లా మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం ఓ మహిళా డాక్టర్‌ స్కూటీపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మోటార్‌ సైకిల్‌తో ఢీకొట్టారు. ఆమె కింద పడగానే అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు,ఓ వ్యక్తి సాయం చేస్తున్నట్లు నటిస్తూ ఆటో ఎక్కిస్తామని చెప్పారు. అదే సమయంలో ఆ మహిళా డాక్టర్‌కు ఓ ఇంజెక్షన్‌ చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే బాధిత వైద్యురాలు తన భర్తకు సమా చారం ఇచ్చి, తనపై విష ప్రయోగం జరి గిందని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు,సెల్‌టవర్‌ లొకేషన్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఘటన సమయంలో నలుగురు వ్యక్తులు అక్కడ ఉన్నట్లు గుర్తించి వారిని అదు పులోకి తీసుకున్నారు.పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితుల్లో బీచుపల్లి బోయ వసుంధర అలియాస్‌ వేదవతి (కర్నూలు) ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది.ఆమె గతంలో ఓ డాక్టర్‌ను ప్రేమించింది.అయితే ఆ డాక్టర్‌ ఆమెను కాకుండా మరో మహిళా డాక్టర్‌ను వివాహం చేసుకున్నాడు.దీంతో ప్రియుడు దక్కలేదన్న కక్షతో వసుంధర ఆ డాక్టర్‌ భార్యపై తీవ్ర ద్వేషం పెంచుకుంది.ఈ క్రమంలో ఆమె బాధిత వైద్యురాలికి హెచ్‌ఐవీ సోకేలా ఇంజెక్షన్‌ చేయాలని పథకం రచించిం ది.ఇందుకు కొంగె జ్యోతి (ఆదోని),భూమా జశ్వంత్‌,భూమా శృతి (మంత్రాలయం)ల సహ కారం తీసుకుంది.ప్రభుత్వ ఆసుపత్రిలో చికి త్స పొందుతున్న హెచ్‌ఐవీ బాధితుల నుంచి ఇతర నర్సుల సహాయంతో హెచ్‌ఐవీ వైరస్‌తో కూడిన రక్తాన్ని సేకరించి,దాన్ని ఇంజెక్షన్‌ రూ పంలో బాధిత మహిళా డాక్టర్‌కు ఎక్కించిన ట్లు పోలీసులు వెల్లడించారు.ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్‌ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ ఘటన సభ్య సమాజాన్ని తీవ్రంగా కలచివేసిం దని,ఇలాంటి నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...