స్వచ్ఛతలో నగరానికి అగ్రస్థానమే లక్ష్యం... పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్...

స్వచ్ఛతలో నగరానికి అగ్రస్థానమే లక్ష్యం
స్వచ్ఛ నగర సాధనకు ప్రజల సహకారం అవసరం
‘స్వచ్ఛ సర్వేక్షన్’ మార్గదర్శకాల అమలు పై సమీక్ష
పి.విశ్వనాథ్,నగరపాలక సంస్థ కమిషనర్
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరాన్ని స్వచ్ఛతలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టడమే ల క్ష్యంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ పారిశుద్ధ్య విభాగ సిబ్బందికి సూచించారు.శుక్రవారం కమిష నర్ నివాస కార్యాలయంలో ‘స్వచ్ఛ సర్వే క్షన్’ మార్గదర్శకాల అమలు,కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహిం చారు.ఈ సందర్బంగా కమిషనర్ పి.విశ్వ నాథ్ మాట్లాడుతూ నగర స్వచ్ఛతను మ రింత మెరుగుపరిచే దిశగా అధికారులు, సిబ్బంది మరింత చురుగ్గా పనిచేయాలని సూచించా రు.స్వచ్ఛ సర్వేక్షన్ తాజాగా వి డుదల చేసిన మార్గదర్శకాలు,విధివిధానాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపా రు.ప్రతి వార్డులో ప్రజలను చైతన్య పరిచే ర్యాలీలు,అవగాహన సదస్సులు,ప్రచార కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించా లని ఆదేశించారు.
వాల్ పెయింటింగ్స్,మైక్ అనౌ న్స్మెంట్లు,వార్డుల మధ్య స్వచ్చత పోటీల ద్వారా ప్రజల్లో స్వచ్ఛతపై మరింత అవ గాహన పెంచాలని పేర్కొన్నారు.స్వచ్ఛ నగర సాధన అనేది కేవలం నగరపాలక బాధ్యత మాత్రమే కాదని,ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామిగా మారినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయ న్నారు.ఇంటి నుంచే చెత్తను వేరు చేయ డం,ప్రజా ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం వంటి చిన్న చర్యలే పెద్ద మార్పుకు దారితీ స్తాయన్నారు.అధికారులు,సిబ్బంది ప్రజ లతో సమన్వయంగా పనిచేస్తూ కర్నూలు ను ఆదర్శ స్వచ్ఛ నగరంగా నిలబెడదా మని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఆర్‌.జి.వి.కృష్ణ,డి ప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు,ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగప్రసాద్,డిఈఈ పవణ్ రెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ శ్రీనివాసులు, సూపరింటెండెంట్లు నాగరాజు,మంజూర్ బాష,‌స్వచ్ఛ సర్వేక్షన్ కోఆర్డినేటర్లు శ్రీని వాస్,కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...