అధిక శబ్దాలు చేసే 100 బైక్ సైలెన్సర్సులు,500 ఆటో హారన్ లు రోడ్ రోలర్‌తో ధ్వంసం...కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్...

అధిక శబ్దాలు చేసే 100 బైక్ సైలెన్సర్లు,
500 ఆటో హారన్ లు రోడ్ రోలర్‌తో ధ్వంసం 
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయం కొండారెడ్డి బురుజు వద్ద అధిక శబ్దాలు చేసే 100 బైక్ సైలెన్సర్లు,500 ఆటో హారన్ లను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వ ర్యంలో శనివారం రోడ్ రోలర్‌తో ధ్వంసం చేయించారు.ఈ సందర్బంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో కొంతమంది యువకులు వారి యొక్క ద్విచక్ర వాహనాలకు అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్స్ ను మాడిఫైడ్ చేసి అమర్చుకుని,అధిక శబ్దం వ చ్చే విధంగా డ్రైవ్ చేయడంతో వారిపై ఒక నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిం చామ న్నారు.డ్రైవ్ లో 100 బైక్ సైలెన్సర్లు,500 ఆటోల హారన్ లను సీజ్ చేయడం జరిగింద న్నారు.కావున వాటిని నేడు రోడ్ రోలర్ తో తొక్కించి ధ్వంసం చేయడం జరిగిందన్నా రు.రాత్రి వేళల్లో అధిక శబ్దం వచ్చే విధంగా సౌండ్ పోల్యూషన్ చే స్తున్నారని ప్రజల నుం డి ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పారు.ప్రజలు,యువతకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన చేస్తు న్నామన్నారు.ఎవరైనా మోడిఫై చేసిన సైలెన్సర్లను ద్విచక్రవాహనాలకు,ఆటోలకు హారన్ లు అమర్చినట్లయితే జరిమనాలతో పాటు ఆ వాహానాలను సీజ్ చేస్తామన్నారు.చట్టం ప్ర కారం శబ్ద కాలుష్యం చేస్తూ అధిక శబ్దం చేసే బైక్ సైలెన్సర్లు,ఆటో హారన్లను అమర్చుకో కూడదన్నారు.అధిక శబ్దం వలన ప్రజలకు అసౌకర్యం కలగడమే కాకుండా,వృద్ధులు, చిన్నారు లు,రోగులకు ఇబ్బందులు కలుగుతున్నాయ న్నారు.మోటార్ వెహికల్స్ చట్టం ప్ర కారం అనుమతి లేని మార్పులు చేసిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు.
ప్రతి వాహనదారుడు వ్యక్తిగత భద్రత పాటించాలని,రోడ్డు భద్రత నియమాలను పాటిం చాలని పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నా రు.కర్నూలు పట్టణంలో సా మాజిక బాధ్యత కలిగిన పబ్లిక్,ప్రవేట్ సంస్ధల వారు ట్రాఫిక్ పోలీ సులకు సహాకారం అం దిస్తున్నారన్నారు.కార్పో రేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి నిధుల క్రింద ట్రాఫిక్ క్రమబద్దీకరణకు దాతలు సహకారం అందిస్తున్నారన్నారు.డిజిటల్ ఎల్ ఈడి డిస్ ప్లే బోర్డును,66 సోలార్ రెడ్ బ్లింకింగ్ స్టడ్స్ ను,4 అధునాతన మూవబుల్ బారికేడ్స్ ను కర్నూలు ట్రాఫిక్ పోలీసు లకు దాతలు అందజేశారన్నారు.అనంతరం దాతలైన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం,గో ల్డ్ షాప్ ప్రభాకర్,డిఈ ఫణీ కుమార్ లకు కర్నూలు ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు.ముఖ్య మైన రద్దీ ప్రాంతాలలో రాత్రి వేళల్లో రోడ్డు బాగా కనిపించే విధంగా సోలార్ రెడ్ బ్లింకింగ్ స్టడ్స్ ను త్వరలో ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా,కృష్ణ మోహన్,కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్,స్పెషల్ బ్రాంచ్ సిఐ మధుసుధన్ రావు,కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, ఆర్ ఐలు,ఆర్ఎస్ఐలు,కర్నూలు ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...