చిలక్కి చెప్పినట్లు చెప్పినా వినలేదు!...డిజిటల్ మోసం నుంచి ఓసారి రక్షించిన పోలీసులు15 రోజు లకు మళ్లీ కాల్...రూ.49 లక్షలు మోసపోయిన వై నం...

చిలక్కి చెప్పినట్లు చెప్పినా వినలేదు!
డిజిటల్ మోసం నుంచి ఓసారి రక్షించిన పోలీసులు
15 రోజులకు మళ్లీ కాల్..రూ.49 లక్షలు మోసపోయిన వైనం

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : 
డిజిటల్ అరెస్టు అనేది లేదని,ఆ పేరుతో వచ్చే కాల్సు స్పందించవద్దని పోలీసులు ఆవిశ్రాం త ఉద్యోగికి చిలక్కి చెప్పినట్లు చెప్పారు.రూ.72.50 లక్షలు బదిలీ చేసేందుకు బ్యాంకు కు వచ్చిన అతణ్ని ఆపారు.ఎవరైనా ఇబ్బంది పెడితే...తమను సంప్రదించాలని భరోసా ఇ చ్చి మరీ పంపించారు.15 రోజుల్లోనే మళ్లీ అలాంటి కాల్ రావడంతో ఈసారి ఆ విశ్రాంత ఉద్యోగి భయపడి,మోసగాళ్లకు రూ.49 లక్షలు బదిలీ చేసేశారు.విజయవాడలో స్థిరప డిన స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగి (65)కి గత నెలాఖరులో ఈడీ నుంచి ఫోన్ చేస్తున్నా మంటూ ఓ కాల్ వచ్చింది.మీపై కేసులున్నాయని బెదిరించారు.యూనిఫాంలో ఉండి వీడి యో కాల్ చేసిన ఓ వ్యక్తి తాను దర్యాప్తు అధికారినని, రూ.72.50 లక్షలు ఇస్తే కేసు మా ఫీ చేస్తానని అన్నాడు.దీంతో విశ్రాంత ఉద్యోగి విజయవాడ రామచంద్రనగర్లోని ఎస్బీఐ బ్రాంచికి వెళ్లారు.తన పేరిట ఉన్న రూ.78లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేసి,అందులో రూ.72.50లక్షలను మరో ఖాతాకు బదిలీ చేయాలని కోరారు.అనుమానం వచ్చిన బ్యాం కు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు వచ్చి ఆ ఖాతా నంబ రు పరిశీలిస్తే అది కోల్కతాకు చెందినదని తేలింది.దీంతో లావాదేవీ నిలిపేసి,మోసాలపై అవగాహన కల్పించి పంపిం చారు.అయినా వినలేదు.తర్వాత విశ్రాంత ఉద్యోగి మళ్లీ బ్యాంకుకు వచ్చి,తాము బెంగళూరుకు మారిపోతున్నామని చెప్పి...ఎఫీ క్లోజ్ చేసి,ఆ మొ త్తాన్ని తన పొదుపు ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు.అనంతరం నగరంలోని ఇండి యన్ బ్యాంకులో ఖాతా తెరిచారు.అక్కడి నుంచి మోసగాళ్ల ఖాతాకు రూ.49 లక్షలు బ దిలీ చేశారు.ఆ సమయంలో బ్యాంకు సిబ్బంది ప్రశ్నించినా...తెలిసిన వ్యక్తికే పంపిస్తున్నా నని చెప్పారు.తీరిగ్గా నాలుగు రోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...