లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మంథని సబ్ రిజిస్ట్రార్...భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.16,500 డిమాండ్...
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మంథని సబ్ రిజిస్ట్రార్భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.16,500 డిమాండ్ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బు స్వీక రిస్తూ అరెస్ట్అవినీతిపై 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచన
పెద్దపల్లి జిల్లాలోని మంథనిలో ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.మంథని సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న కాసర్ల రాజేందర్,భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం స్వీకరిస్తుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే...ఒక వ్యక్తి కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రే షన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ రూ. 16,500 లంచం డిమాండ్ చేశారు.బాధి తుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నా రు.రాజేందర్ సూచన మేరకు,బాధితుడు ఆ డబ్బును రషీద్ అనే ప్రైవేట్ డాక్యుమెంట్ రైట ర్‌కు మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇస్తుండగా ఏసీబీ అధికారులు వారిని పట్టు కున్నారు.ఈ సంద ర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు.ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే,తమ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి ఫి ర్యాదు చేయాలని కోరారు.వాట్సాప్ (9440446106),ఫేస్‌బుక్,అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని తెలిపారు.ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
Comments
Post a Comment