ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ...ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు బ్రిటిష్ పౌరుడు...

ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ
ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు బ్రిటిష్ పౌరుడు
19 ఏళ్ల పాటు సాగిన అన్వేషణ ఎట్టకేలకు సఫలం
130 ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌లో మరణించిన బ్రిటిష్ సైనికుడు
జర్నలిస్ట్ సహాయంతో తిరుమలగిరి 
శ్మశాన వాటికలో సమాధి గుర్తింపు
పూర్వీకుడి సమాధి వద్ద కన్నీటి నివాళులర్పించిన ముని మనవడు

VS9TV న్యూస్, హైదరాబాద్ :
ప్రేమ,అనుబంధాలకు సరిహద్దులు ఉండవన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఈ ఘటన.ఏకంగా 130 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో కన్నుమూసిన తన ముత్తాత సమా ధిని వెతుక్కుంటూ ఓ వ్యక్తి ఇంగ్లండ్ నుంచి నగరానికి వచ్చారు.19 సంవత్సరాల పాటు సాగించిన అన్వేషణ ఫలించడంతో,తన పూర్వీకుడి సమాధి వద్ద భావోద్వేగంతో నివాళు లర్పించారు.వివరాలు ఇలా ఉన్నాయి...ఇంగ్లండ్‌కు చెందిన రాబిన్ డిక్సన్ తన ఇంట్లోని పాత దస్త్రాల ద్వారా,తన ముత్తాత (తాతకు తండ్రి) చార్లెస్ విల్సన్ బ్రిటిష్ ఇండియాలో మరణించారని తెలుసుకున్నారు.చార్లెస్ విల్సన్ 1880లో బ్రిటిష్ సైన్యంలో చేరి బెంగ ళూరు,మద్రాసులలో పనిచేశారు.ఆ తర్వాత సికింద్రాబాద్ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్‌గా పని చేస్తున్న సమయంలో,1906,ఆగస్టు,4న అనారోగ్యంతో తిరుమలగిరి ఆసుపత్రిలో మర ణించారు.అప్పట్లో ఆయన వయసు 48 సంవత్సరాలు.అప్పటి నుంచి తన ముత్తాత స మాధి ఎక్కడ ఉందో తెలుసుకోవాలని రాబిన్ డిక్సన్ గట్టిగా సంకల్పించుకున్నారు. దా దాపు 19 ఏళ్ల పాటు బెంగళూరు,చెన్నై, సికింద్రాబాద్‌లలో గాలించారు.ఈ క్రమంలో స్థా నిక పాత్రికేయుడు రవిరెడ్డి సహాయంతో,ఎనిమిది నెలల క్రితం సికిం ద్రాబాద్‌లోని తిరు మలగిరి 'సెమెట్రీ-12'లో చార్లెస్ విల్సన్ సమాధిని గుర్తించారు.ఈ విషయం తెలియగా నే రాబిన్ తన భార్య లిన్‌తో కలిసి ఇంగ్లండ్ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చారు. ముత్తాత సమాధిపై తెల్ల గులాబీలు ఉంచి కన్నీటి పర్యంతమయ్యారు."ఈ క్షణం కోసమే ఇన్నేళ్లుగా ఎదురుచూశాను" అని రాబిన్ తీవ్ర భావోద్వేగంతో అన్నారు.ఒక శతాబ్దానికి పై గా సాగిన ఈ అనుబంధం,రాబిన్ అన్వేషణతో పూర్తయింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...