2021లో కర్నూలు జిల్లాలో కావేరి జాదురకం పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం జమ చేయాలి...ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి డిమాండ్...

2021లో కర్నూలు జిల్లాలో కావేరి 
జాదురకం పత్తి విత్తనాలు వేసి 
నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం జమ చేయాలి
ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
కె.ప్రభాకర్ రెడ్డి డిమాండ్

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
కలెక్టర్ కార్యాలయం ముందు 2021వ సంవత్సరంలో కావేరి జాదు రకం విత్తనాలు వేసి నష్టపోయిన బాధిత రైతుల ధర్నా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం జరిగింది.ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ కమిషనర్ ఇచ్చిన ఆ ర్డర్ ను తక్షణమే అమలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు.2021వ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 18 మండలాలలో 1889 మంది రైతులు కావేరి జాదూరకం పంట సాగు చేసినట్లు చెప్పారు.కావేరి కంపెనీ వారు నకిలీ విత్తనాలు సరఫరా చేయడం వల్ల పంట దిగుబడి రాకపోవడం చేత వివిధ రూపాలలో ఆందోళన చేసిన ఫలితంగా శాస్త్రవేత్తలు పరిశీలన చేసి మూడు కింటల నుం డి ఏడు క్వింటాళ్ల వరకు నష్టం జరిగినట్లు నివేదిక ఇచ్చారని అన్నారు.జరిగిన నష్టానికి ప రిహారం ఇవ్వాలని ఒక ఎకరాకు రూ.23,107 చొప్పున రైతులకు అందించాలని కలెక్టర్ అధ్యక్షతన ఉన్న కమిటీ కంపెనీని ఆదేశించింది.ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తయిన కంపెనీ వారు రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ ఒక్క పైసా కూడా చెల్లిం చకుండా కోర్టుల చుట్టూ కమిషనర్ కార్యాలయం చుట్టూ తిప్పుచు ఇబ్బందులకు గురి చే స్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు కంపెనీ యాజమాన్యం హైకోర్టుకు పోయి స్టే తె చ్చుకోవడానికి ప్రయత్నిస్తే వెనక్కు పంపి కమిషనర్ దగ్గర ఆపిల్ చేసుకోమని మొట్టి కా యలు వేసినట్లు ఫలితంగా కమీషనర్ కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన విచారణ జ రిపి తుది తీర్పు ఇవ్వడం జరిగింది.40 శాతం రైతులకు చెల్లించాలని ఆదేశించారు.కానీ ఇప్పటివరకు ఒక్క పైసా కూడా రైతులకు ఇవ్వకుండా కావేరి కంపెనీ కాలయాపన చేస్తు న్నదని ఇది ఏ మాత్రం క్షమించరానిదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రకటించిన 40శాతం అయినా రైతుల ఖాతాల్లో జమ చేసి రైతులకు ఉపశమ నం కలిగించాలని కోరారు.ఆలస్యం జరిగితే కలెక్టర్ కార్యాలయం ముందు పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్భంధనము చేస్తామని వారు హెచ్చరిం చారు.ధర్నా అనంతరం అనంతరం కలెక్టర్ డాక్టర్ సిరిని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశా రు.అనంతరం కలెక్టర్ చాలా సానుకూలంగా స్పందించి వెంటనే సమస్య పరిష్కారం చేసి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహా య కార్యదర్శి ఏ.కృష్ణ,రైతు సంఘం జిల్లా నాయకులు జి.ఆంజనేయులు,కావేరి కంపెనీ బాధిత రైతుల కమిటీ నాయకులు శివారెడ్డి పెద్దారెడ్డి,నగేష్,కృష్ణా రెడ్డి,మాణిక్యాల రెడ్డి, వెంకటరాముడు,భూపనపాడు రాజు,రంగన్న,జగన్నాథం,మహేశ్వర్ రెడ్డి,కె.గిడ్డయ్య,భా స్కర రెడ్డి,రమణారెడ్డి,వెంకటేశ్వర్ రెడ్డి,వేణుగోపాల్,అశోక్ కుమార్,ఎర్ర మద్దిలేటి,ఎల్ల య్య,శేఖర్,కె.నారాయణ,బాధిత రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...