కర్ణాటకలో రూ.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే...

కర్ణాటకలో రూ.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన బీజేపీ ఎమ్మెల్యే
రహదారి పక్కన గోడ నిర్మించడంతో కాంట్రాక్టర్ నుంచి రూ.11 లక్షలు డిమాండ్
తన ఆసుపత్రిలోనే ఎమ్మెల్యే రూ.5 లక్షలు తీసు కుంటుండగా పట్టుకున్న లోకాయుక్త
VS9TV న్యూస్,కర్ణాటక :
కర్ణాటకలో కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీ సులు ఒక బీజేపీ ఎమ్మెల్యేను పట్టుకున్నారు. గదగ జిల్లా శిరహట్టి నియోజకవర్గం ఎమ్మెల్యే డా క్టర్ చంద్రులమాణి లంచం తీసుకుంటూ లోకా యుక్తకు చిక్కారు.రహదారి పక్కన గోడ నిర్మించి న విజయ్ పూజార్ అనే కాంట్రాక్టర్ నుంచి ఎమ్మెల్యే రూ.11 లక్షలు డిమాండ్ చేశారు.దీంతో విజయ్ పూజార్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశా రు.లక్ష్మేశ్వరపురలోని తన ఆసుపత్రిలోనే ఎమ్మె ల్యే రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎమ్మెల్యేతో పాటు అతడి ఇద్దరు సహాయకులు మంజునాథ్ వాల్మీకి,గురునాయక్‌లను అరెస్టు చేశారు.మైనర్ ఇరిగేషన్ శాఖ కింద ఉన్న రోడ్డు లో గోడ నిర్మించడంతో, దీనికి క్లియరెన్స్ ఇవ్వ డానికి ఎమ్మెల్యే కాంట్రాక్టర్ నుంచి రూ.11 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నా యి.ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు లోకా యుక్త తెలిపింది.దార్వాడ లోకాయుక్త ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలో అధికారులు,సిబ్బంది దాడిలో పాల్గొన్నారు.నగదు డిమాండ్ చేస్తూ విజయ్‌కు చేసిన ఫోన్ కాల్ ఆడియో ఆధారంగా ఎమ్మెల్యేపై నిఘా పెట్టారు. అవినీతి నిరోధక చ ట్టం, 1988 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అరెస్టుకు సంబంధించిన సమాచా రాన్ని అసెంబ్లీ స్పీకర్‌కు ఇచ్చారు.ఈ అరెస్టుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. లంచం తీసుకుంటుండగా ఎమ్మెల్యే లమానీని లోకాయుక్త పట్టుకుందని అన్నారు. బీజేపీ నా యకులు ఇప్పుడు ఏం సమాధానం చెబు తారని ప్రశ్నించారు.ఇతరులపై అవినీతి,లంచం ఆరోప ణలు చేయడం సులభమని కానీ ఇప్పుడు వారి ఎమ్మెల్యేనే పట్టుబడ్డారని అన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...