ప్రేమ పేరుతో నయవంచన...ఆత్మహత్యకు పాల్పడిన యువతి...

ప్రేమ పేరుతో నయవంచన
ఆత్మహత్యకు పాల్పడిన యువతి
VS9TV న్యూస్,గుంటూరు :
ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.ఫోటోలతో బ్లాక్‌ మెయిల్‌కు దిగాడు.చివరకు ఆ యువతి ప్రాణం పోయేలా చేశాడు.గుంటూరు జిల్లాలో ఈ దారు ణ ఘటన జరిగింది.తల్లిదండ్రులు ధైర్యం చెప్పి నా,ఆ కిరాతకుడి బెదిరింపులకు భయపడి యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలిం చిన ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.వివరాలు ఇలాఉన్నాయి...
గుంటూరు జిల్లా,తాడేపల్లి మండలం, పోలకం పాడులో శ్రీనివాసరెడ్డి,రమణమ్మ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అమ్మాయి మీనాక్షి డిగ్రీ చదువుతుంది.అబ్బా యి ఇంటర్ చదువుతున్నాడు. శ్రీనివాసరెడ్డి ముఠా పనులకు వెల్తుండగా,రమణమ్మ హోటల్స్‌లో కూలీ పనులు చేస్తుంది.మీనాక్షి చదివే కాలేజ్‌లోనే రహీం చదువతుండగా.. అతడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.గత కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ఫోటోలు తీసుకున్నారు.అయితే రహీం ప్రవర్తన నచ్చక పోవడంతో మీనాక్షీ అతనికి దూరంగా ఉంటుం ది.మీనాక్షి తనతో మాట్లాడకపోవఠంతో రహీం కక్ష పెంచుకున్నాడు.మీనాక్షి ఫోన్‌కి మెస్సెజ్‌లు పంపుతూ బెదిరిస్తున్నాడు.ఇద్దరి ఫోటోలను ఆమె తల్లిదండ్రులకు పంపుతానని ఈ నేపథ్యం లో తనతో పాటు రూమ్‌కి రావాలని లేదంటే మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ రహీం బెదిరింపులకు దిగాడు. మొదట పెద్దగా పట్టించుకోని మీనాక్షి రహీం బెది రింపులు పెరిగిపోవడంతో మనోవేదనకు గురైం ది.కూతురి ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమ నించిన తల్లిదండ్రులు నిలదీశారు.దీంతో రహీం తో తన పరిచయం దగ్గర నుండి మొత్తం జరిగిన దంతా చెప్పింది.విషయం తెలుసుకున్న తల్లి దండ్రులు కూతుర్ని ఓదార్చారు.అతని బెదిరిం పులకు భయపడవద్దని చెప్పారు.అయితే ఆ తర్వాత కూడా రహీం బెదిరింపులు ఆగలేదు.ఈ క్రమంలో తల్లిదండ్రులు పనులకు,తమ్ముడు కాలే జ్‌కు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసు కుంది.సాయంత్రం తల్లి రమణమ్మ పనులు ముగించుకుని ఇంటికొచ్చేసరికి మీనాక్షి ఫ్యాన్‌కు వ్రేలాడుతూ కనిపించింది.దీంతో లబోదిబోమని తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది.స్థానికుల సమా చారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేపట్టారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...