అసెంబ్లీలో నిమ్మల వ్యాఖ్యలు అర్థరహితం... ఎం.శ్రీహర్ష,కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు...

అసెంబ్లీలో నిమ్మల వ్యాఖ్యలు అర్థరహితం
ఎం.శ్రీహర్ష,కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
కర్నూలు జిల్లా ప్రజల జీవనాధారంగా భావిస్తున్న గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి,జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష పే ర్కొన్నారు.శనివారం బిర్లా కాంపౌండ్‌లోని కేపిఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ...గుండ్రే వుల ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ,వివిధ సాకులు ప్రస్తావిస్తూ ప్రక్రియను వాయిదా వేయాలనే భావనతో మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్రామాలు,కర్ణాటకలో ఒక గ్రామం ముంపునకు ప్రభావితమవుతాయని అది క్లిష్టమైన ప్రక్రియ కాకపోయినా దాన్ని సాకుగా చూపడం సరైంది కాదన్నారు.వాస్త వానికి ఆయా ప్రాంతాల ప్రజలకే అధిక ప్రయోజనం చేకూరే ఈ ప్రాజెక్టును పరస్పర చర్చ లతో పరిష్కరించవచ్చని శ్రీహర్ష స్పష్టం చేశారు.కేఆర్‌ఎంబి,సిడబ్ల్యుసి,అపెక్స్ కౌన్సిల్ అ నుమతులు అవసరమని పేర్కొనడం పరిపాలనా ప్రక్రియలో భాగమేనని,అయితే వాటిని సాధించేందుకు చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యతేనని గుర్తుచేశారు.తగిన సమన్వ యం,చర్చల ద్వారా అనుమతులు పొందడం సాధ్యమేనని తెలిపారు.అనేక ఇబ్బందులు, ఒ త్తిళ్ల మధ్య కేపిఎస్ కొనసాగిస్తున్న ఉద్యమానికి ప్రభుత్వంలో స్పందన కనిపించడం స్వాగ తించదగినదే అయినప్పటికీ,చట్టసభలో నిరుత్సాహపరిచే వ్యాఖ్యలు చేయడం తగదన్నా రు.తమ ఉద్యమాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు బెదిరింపులు,ఫ్లెక్సీల తొలగింపు లు వంటి అనుచిత చర్యలకు పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.అయినప్పటికీ కేపిఎస్ నిరంతర పోరాటం ఫలితంగానే ప్రభుత్వ స్థాయిలో కదలిక ప్రారంభమైందన్నారు.జలస మర దీక్షలు,రౌండ్ టేబుల్ సమావేశాలు,లక్షలాది కరపత్రాల పంపిణీ,ప్రధాన మంత్రి, ము ఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి వారికి లేఖలు పంపడం,గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు, పోస్టర్ల ఆవిష్కరణ వంటి ఉద్యమ కార్యక్రమాల వల్లే చర్చలు వేగవంతమయ్యాయని తెలి పారు.అసెంబ్లీలో గుండ్రేవుల ప్రాజెక్టు అవసరాన్ని ప్రస్తావించిన బొగ్గల దస్తగిరికి ప్రత్యేక కృ తజ్ఞతలు తెలిపారు.రైల్ బండి ఉందని బొంబాయికి,భాషా వచ్చని బళ్ళారికి,చదువు లేక ఉపాధికి గుంటూరుకు,చదువు ఉన్నా ఉపాధిఇ హైదరాబాద్,బెంగళూరులకు ఈ ప్రాంత ప్రజలు వలస వెళ్తున్న పరిస్థితి ఆందోళనకరమన్నారు.ప్రభుత్వం మానవతా దృష్టితో ఆలో చించి ప్రాంతీయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో నీటి సం ఘ నాయకులు పులకుర్తి భాస్కర్ రెడ్డి,గూడూరు నాగిరెడ్డి,ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ మ న్సూర్ రహేమాన్,కేపిఎస్ సభ్యులు నౌషద్,హరినాథ్,శ్రీనివాసులు,ప్రేమ్,రామాంజనేయు లు,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...