నదులను కాపాడటం ప్రతి పౌరుని కర్తవ్యం...కెసి కెనాల్ స్వచ్ఛత పనులు కలెక్టర్ ఏ.సిరి పరిశీలన...

నదులను కాపాడటం ప్రతి పౌరుని కర్తవ్యం
కెసి కెనాల్ స్వచ్ఛత పనులు కలెక్టర్ ఏ.సిరి పరిశీలన

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
పౌరుల బాధ్యతాయుత సహకారంతోనే నదుల సంరక్షణ ఫలప్రదమవుతుందని,నదులను కాపాడటం ప్రతి పౌరుని కర్తవ్యం అని జిల్లా కలెక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు.శనివారం వినా యక ఘాట్ సమీపంలో కెసి కెనాల్‌లో కొనసాగుతున్న శుభ్రత పనులను నగరపాలక సం స్థ కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.కెనాల్ పరిసరాల్లో చెత్త పార వేయడాన్ని కట్టడి చేయడానికి మున్సిపల్ శానిటేషన్, జలవనరుల శాఖ సిబ్బంది ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.దెబ్బతిన్న రక్షణ వలయాలను తక్షణ మే పునరుద్ధరించాలని సూచించారు.కెనాల్‌లోకి మురుగునీరు ప్రవహిస్తున్న ప్రదేశాలను గుర్తించి,వాటి మళ్లింపుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని స్పష్టం చేశా రు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...నగర నడిబొడ్డున ప్రవహించే ఎసి కెనాల్ నగర సౌందర్యానికి ప్రతీకగా నిలవాలని,అయితే పరి సర ప్రాంతాల నిర్లక్ష్యంతో అపరిశుభ్రత నె లకొనడం విచారకరమన్నారు.నీటి ప్రవాహం తగ్గిన వేళ దుర్వాసనలు,దోమల ప్రబలత వంటి సమస్యలు పెరిగి ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని తెలిపారు.రక్షణ కం చెలను ధ్వంసం చేసి వ్యర్థాలు పారవేయడం సమంజసం కాదని హెచ్చరించారు.కెనాల్ శుభ్రత,సంరక్షణకు ప్రజా ధనం వినియోగమవుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పే ర్కొన్నారు.విజ్ఞతతో ఆలోచించి ప్రజలు చెత్తను మున్సిపల్ వాహనాలకే అప్పగించి సహ కరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.ఈకార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు,ప్రజారోగ్య అ ధికారి డాక్టర్ నాగ ప్రసాద్ బాబు,డిఈఈ పవన్ కుమార్ రెడ్డి,శానిటేషన్ ఇన్ స్పెక్టర్లు ఆ ర్‌.రాజు,నాగేశ్వరరావు,మల్లికార్జున,కోఆర్డినేటర్లు జయక్రిష్ణ,శ్రీనివాస్,కార్తిక్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...