భర్త LLB ...B.Com భార్య...రాజన్న సన్నిధిలో భిక్షాటన...తల రాతలో చదువుల ‘సిరి’ ఉన్నా.. విధి రాతలో ‘భిక్షాటన...

భర్త LLB ...B.Com భార్య...రాజన్న సన్నిధిలో భిక్షాటన.
తల రాతలో చదువుల ‘సిరి’ ఉన్నా.. విధి రాతలో ‘భిక్షాటన
వేములవాడ రాజన్న సన్నిధిలో కన్నీటి గాథ
VS9TV న్యూస్,హైదరాబాద్ :
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పుణ్యక్షేత్రం వేముల వాడ...ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆ రాజ రాజేశ్వరుని సన్నిధిలో ఇప్పుడు ఒక దీన గాథ అందరినీ కంటతడి పెట్టిస్తోంది.కాన్వెంట్ చదువు లు,ఉన్నత డిగ్రీలు ఉన్నా.. కాలం చేసిన గాయా నికి ఆ దంపతులు నేడు యాచకులుగా మారా రు.

అనర్గళంగా ఇంగ్లీష్,ఆశ్చర్యపోయిన అధికారులు :

వేములవాడ ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తు న్న వారికి పోలీసులు,అధికారులు కలిసి ఇటీవల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ గుంపులో ఉన్న ఒక జంటను పలకరించిన అధికారులకు నోట మాట రాలేదు.వారు మాట్లాడుతున్న అనర్గళ మైన ఇంగ్లీష్,వారి ఆహార్యం చూసి అవాక్కయ్యారు.

భర్త జలంధర్ రెడ్డి: లా (LLB) పూర్తి చేసిన విద్యావంతుడు.

భార్య శిరీష: బీకాం కంప్యూటర్స్ చదివిన పట్టభద్రురాలు.

కరీంనగర్‌కు చెందిన ఈ దంపతులు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలిస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. భార్య ఆరోగ్యం క్షీణించ డంతో,ఆమెకు తోడుగా ఉంటూ...రాజన్నే దిక్క ని నమ్మి ఇక్కడికి వచ్చారు.చిన్న చిన్న పనులు చేసుకుంటూ,ఆ దేవుడి ప్రసాదంతోనే కడుపు నింపుకుంటున్నారు.నేటి కాలంలో చిన్న కారణా లకే విడిపోతున్న జంటల మధ్య...భార్య కోసం సర్వం వదులుకుని అండగా నిలిచిన ఆ భర్త ప్రేమ చూసి అధికారులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు.ఆస్తులున్నా.. ఆదరణ కరువైన వృద్ధులు కేవలం ఈ దంపతులే కాదు...అక్కడ సుమారు 100మందికిపైగా యాచకులు ఉన్నా రు.వారిలో అత్యధికులు వృద్ధులే.వారి గాథలు వింటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు.
కన్నపిల్లల వేధింపులు,కొందరు కొడుకులు, కోడ ళ్లు పెడుతున్న హింస భరించలేక ఇక్కడికి చేరా రు.

భయం నీడలో : 
ఇంటికి వెళ్తే పిల్లలు కొట్టి చంపుతారేమో అన్న భయంతో రాజన్నను ఆశ్రయించారు.

దిక్కులేని స్థితి : "ఆస్తులు ఉన్నాయి,అంతస్తు లు ఉన్నాయి.కానీ మమ్మల్ని ప్రేమించే మన సున్న మనుషులు లేరు.అందుకే మా రాజన్నే మమ్మల్ని సాదుతున్నాడు" అంటూ ఆ వృద్ధులు బోరున విలపించడం అక్కడి వాతావరణాన్ని విషాదంలోకి నెట్టింది.

అధికారుల భరోసా,"వేధించే వారిపై కఠిన చర్యలు :

అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ...ఆ లయ పరిసరాల్లో భిక్షాటన నిషేధమని,అయితే సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. "వృద్ధు లను ఆదరించకుండా వీధుల్లోకి నెట్టే పిల్లలపై, వారిని వేధించే బంధువులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.కౌన్సిలింగ్ ద్వారా వారిని తిరిగి తమ ఇళ్లకు పంపేలా ప్రయత్నిస్తాం" అని ఆయన పేర్కొన్నారు.ఉన్నత చదువులు చదివి న జలంధర్ రెడ్డి,శిరీషల కథ మన విద్యా వ్యవస్థ కు,సమాజానికి ఒక హెచ్చరిక.ఆర్థిక ఇబ్బందు లు,అనారోగ్యం మనిషిని ఎంతటి స్థితికైనా దిగజార్చగలవని, కానీ ఆ కష్టాల్లోనూ వీడని వారి బంధం ఒక గొప్ప పాఠమని ఈ ఘటన నిరూపిస్తోంది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...