ఏప్రిల్,1 నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్...ఆషా నిరసన...
ఏప్రిల్,1 నుండి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్
ఆషా నిరసన
పేరుకుపోయిన బకాయిలను విడుదల చేయక పోవ టం,నెలలు తరబడి చిన్నవిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించకపోవటం పట్ల సరసన వ్యక్తం చేస్తూ మరోసారి ఏప్రిల్,1వ తేదీ,బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తు న్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పె షాలిటీ హాస్పటల్స్ అసోసియే షన్ (జపా) రాష్ట్ర కార్యవర్గం మంగళవారం ఒక ప్రక టన విడుదల చేసింది.ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కిం ద రాష్ట్రంలో నెట్వర్క్ ఆనుపత్రులు పేద వర్గాల ప్రజ లకు అందించిన వైద్య సేవలకుగాను ఇప్పటికే మూ డు వేల కోట్లు బకాయిలు పేరుకుపోయాయని,వాటి ని గత డిసెంబర్ నెలాఖరు నాటికి చెల్లిస్తామని చెప్పి న రాష్ట్రప్రభుత్వం ఇంత వరకు చెల్లించలేదని,దానికి తోడు గత మూడు నెలలుగా బకాయిలు మరింత పె రిగి,అనుపత్రుల మనుగడ కష్టంగా మారిందని కార్య వర్గం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.ఒకపక్క బకాయి లు చెల్లించకుండా,మరోపక్క యూనివర్సల్ హెల్త్ స్కీం అంటూ పదే పదే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చే స్తోందని,ఇది ఎంత మాత్రం సరైన విధానం కాదని ఆషా కార్యవర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది.
Comments
Post a Comment