సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు...117 మంది అరెస్ట్....
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు...117 మంది అరెస్ట్
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు.విదేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్న క్రిమినల్స్ కు మ్యూల్ అకౌంట్లు సమకూరుస్తున్న వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు.ఫిబ్రవరిలో ఆపరేషన్ ఆక్టోపస్ పేర వేర్వేరు రాష్ట్రాల్లో దాడులు జరిపిన ప్రత్యేక బృందాలు 117 మంది నిందితులను అరె స్ట్ చేశారు.వీటిలో అత్యధికంగా ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ నేరాలు 63 ఉన్నాయి.ఆ తరువాత 6 డిజి టల్ అరెస్టులు, 4ఓటీపీ ఫ్రాడ్, ఒక సోషల్ మీడి యా మోసం కేసులు ఉన్నాయి.ఇక,గత నెలలో రూ. 34.76లక్షలను బాధితులకు రీఫండ్ చేశా రు.
1081కేసుల్లో :
ఆపరేషన్ ఆక్టోపస్ లో భాగంగా 16 రాష్ట్రాల్లో అరెస్ట్ చేసిన 117మంది నిందితులకు దేశ వ్యా ప్తంగా 1,081 కేసులతో సంబంధం ఉన్నట్టుగా వెల్లడైందని అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్) ఎం.శ్రీనివాస్ తెలిపారు.వీరి ఖాతాల్లో నుంచి రూ.139 కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా నిర్దా రణ అయ్యిందన్నారు.ఇక,నిందితుల నుంచి రూ 36లక్షలు నగదు, 221 మొబైల్ ఫోన్లు,26ల్యాప్ టాప్ లు,115 చెక్ బుక్కులు,141 సిమ్ కార్డులు, 54 డెబిట్ కార్డులు,56 షెల్ కంపెనీల స్టాంపులు, ఒక క్యాష్ కౌంటింగ్ మిషన్,152 పాస్ బుక్కులు, 5 ట్రేడ్ లైసెన్సులు,ఆరు ఆడిట్ నివేదికలు, 3 లెడ్జ ర్లను సీజ్ చేసినట్టు వివరించారు.
జోనల్ సైబర్ సెల్స్ :
జోనల్ సైబర్ సెల్స్ కు గత నెలలో 2,963 పిటి షన్లు వచ్చాయి.వీటిలో 461 పిటిషన్లపై అధికా రులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.ఈ కేసుల్లో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 11మందిని అరెస్ట్ చేశారు.బాధితులకు 24.10 లక్షలను రీఫండ్ చేశారు.
సైబర్ పెట్రోలింగ్ :
సైబర్ పెట్రోలింగ్ ను నిరంతరం జరుపుతూ ఇం టెలిజెన్స్ ట్రాకింగ్ ద్వారా ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ లను సోషల్ మీడియాలో ప్రోత్సహిస్తున్న124 ఫేస్ బుక్,ఇన్ స్టాగ్రాం ప్రొఫైళ్లను సైబర్ పోలీసులు గుర్తించారు. 539 పెయిడ్ అడ్వర్టయిజ్ మెంట్లను నడుపుతూ యువతను బెట్టింగ్,గేమింగ్ వైపు ఆకర్షితులను చేస్తున్నారు. ఈ క్రమంలో 124 ప్రొఫైళ్లను సోషల్ మీడియా ప్లాట్ ఫాంల నుంచి తొలగించారు.
సీ మిత్ర :
సీ మిత్ర ద్వారా గత నెలలో సైబర్ మోసాలకు గురైన 2,396మంది బాధితులకు ఫిర్యాదులు నమోదు చేయటంలో మార్గదర్శకత్వం అందిం చారు.ఈ క్రమంలో వచ్చిన కంప్లయింట్ల ఆధా రంగా 257 జీరో ఎఫ్ఐఆర్ లను జారీ చేశారు. సైబర్ మోసానికి గురైతే బాధితులు వెంటనే 19 30 నెంబర్ కు ఫోన్ చేయాలని అదనపు కమి షనర్ శ్రీనివాసులు సూచించారు.దాంతో పాటు www.cybercrime.gov.in లో కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
Comments
Post a Comment