ఢిల్లీ విమానాశ్రయంలో 1.4కిలోల బంగారంతో పట్టుబడ్డ కొండా విజయ్ కుమార్...
ఢిల్లీ విమానాశ్రయంలో 1.4 కిలోల బంగారంతో పట్టుబడ్డ కొండా విజయ్ కుమార్
ఢిల్లీ విమానాశ్రయంలో 1.4 కిలోల అసలైన బంగా రంతో పట్టుబడ్డ కొండా విజయ్ కుమార్ కేసును విచా రిస్తుండగా సూర్య భాయ్ (అసలు పేరు పల్లాపు సురే ష్ కుమార్) పేరు వెలుగులోకి వ చ్చింది.ఫోన్ డేటా, సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఆధారంగా ఇతడిని గుర్తిం చిన అధికారులు విచా రణకు పిలిచారు.ఆ సమ యంలో అతను 12రకాల ఆభరణాలు ధరించి వ చ్చాడు.మొదట ఆ నగలు సుమారు కోటి రూపాయ ల విలువ చేస్తాయని అధికారుల ముందు ప్రగల్భాలు పలికాడు.కానీ,విచారణ ముదురుతున్న కొద్దీ మాట మార్చాడు.ఐటీ శాఖ వాల్యూయర్లు ఆ నగలను పరీక్షించగా,వాటి మొత్తం విలువ కేవలం రూ.3 లక్ష లు మాత్రమేనని తేలింది.అతను ధరించిన నగల్లో చాలా వరకు రాగిపై రోడియం కోటింగ్ పూసినవి.ఒక నగ మాత్రం వెండిపై బంగారు పూత పూసి నదని అధి కారులు గుర్తించారు.ప్రజల ముందుకు వచ్చిన ప్రతి సారి అతను దాదాపు 32రకాల ఇమిటేషన్ (నకిలీ) నగలను మార్చి మార్చి వాడేవాడని,అవి రంగు వెలిసి పోయిన ప్పుడల్లా కొత్తవి కొనేవాడని విచారణలో తేలింది.యూట్యూబ్ ఇంటర్వ్యూలు,సోషల్ మీడి యా పోస్టుల ద్వారా తాను ఒక ధనవంతుడైన ‘గోల్డ్ మ్యాన్’ అని అతను కలరింగ్ ఇచ్చేవాడని అధికారు లు తెలిపారు.అతని ఆర్థిక రికార్డులు పరిశీలించగా, ఆ బిల్డప్‌కు తగ్గట్టుగా ఏమీ లేవని స్పష్టమైంది.గత ఆరేళ్లలో కేవలం 2022-23 ఆర్థిక సంవత్సరంలో మా త్రమే అతను ఐటీ రిటర్న్స్ దాఖలు చేశాడు.అందు లో తన వార్షిక ఆదా యం కేవలం రూ.4.9లక్షలుగా చూపాడు.జిమ్ ట్రైనర్‌గా,చికెన్ షాప్ యజమానిగా ఈ ఆదా యం వస్తున్నట్లు పేర్కొన్నాడు.అంతేకాకుం డా, అతని పేరు మీద గానీ,అతని భార్య పేరు మీద గానీ ఎలాంటి స్థిరాస్తులు లేవని,ప్రస్తుతం నెలకు రూ. 20,000 అద్దె చెల్లిస్తూ ఒక ఫ్లాట్‌లో ఉంటున్నారని అ ధికారులు గుర్తించారు.అతని వద్ద థార్,సఫారీ,ఎం డీవర్ వంటి కార్లు,బుల్లెట్ బైక్ ఉన్నప్పటికీ...అవి కేవ లం ప్రదర్శన కోసమేనని,భూ వివాదాల సెటిల్ మెంట్ల లో వచ్చే కమిషన్లతో వాటిని కొనుగోలు చేసినట్లు అ ధికారులు నిర్ధారించారు.అలాగే అతను నడుపుతు న్నట్లు చెప్పుకునే ‘SNS ప్రజా సేవా ఫౌండేషన్’, వృద్ధా శ్రమానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ గానీ,పాన్ కార్డుగా నీ లేవని తేలింది.విచారణలో సూర్య భాయ్ తన అస లు ఉద్దేశాన్ని బయటపెట్టాడు.సినిమాల్లో అవకాశాల కోసం, అందరి దృష్టిని ఆకర్షించడానికే తాను ఇలా బంగారు నగలతో హడావుడి చేసినట్లు అంగీకరిం చాడు.ఇప్పటికే ‘ఘటికుడు’ సహా రెండు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించినట్లు అతను తెలిపాడు.విచా రణ అనంతరం అత డిని విడిచిపెట్టిన అధికారులు, విజయ్ కుమార్ కు సంబంధించిన ప్రధాన కేసుపై వి చారణ కొనసాగిస్తున్నారు.
Comments
Post a Comment