అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా మార్చి,15వ తేదీన అభ్యాసకులకు పరీక్షల నిర్వహణ...పరీక్షల నిర్వహ ణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి..జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి...
అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా మార్చి,15వ తేదీన అభ్యాసకులకు పరీక్షల నిర్వహణ
పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకో వాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా మార్చి,15 వ తేదీన అభ్యాసకులకు నిర్వహించనున్న పరీ క్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశిం చారు.శనివారం పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,62,235 మంది అ భ్యాసకులు పరీక్షలు రాయనున్నారన్నారు.వీరి కోసం జిల్లాలో మొత్తం 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.1,368 పరీక్షా కేంద్రాలకు ఇన్విజిలేటర్లుగా అంగన్వాడీ టీచర్లు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను నియమించాలన్నారు.మార్చి,15వ తేదీ (ఆది వారం) ఉదయం 10.00 గంటల నుండి సాయం త్రం 5.00 గంటల వరకు పరీక్షలు జరుగుతాయ న్నారు.అభ్యాసకులు తమకు అనుకూలమైన సమయంలో పరీక్షను రాయవచ్చన్నారు.అన్ని పరీక్షా కేంద్రాలలో మంచినీటి సదుపాయం,శాని టేషన్ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించా రు..ప్రతి అభ్యాసకునికి ఈ పరీక్ష గురించి పొదు పు సంఘాలు,శ్రామిక సంఘాల ద్వారా విస్తృతం గా సమాచారం అందజేసి, తప్పనిసరిగా పరీక్షకు హాజరు అయ్యేలా చూడాలని కలెక్టర్ అధికారుల ను ఆదేశించారు.సంబంధిత శాఖల అధికారు లు,ఎంపీడీవోలు,ఏపీఎంలు, అధికారులు జిల్లా అం తటా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశిం చారు. పరీక్ష అనంతరం పేపర్లను సరిచేసి,అవా ర్డ్ షీట్లలో మార్కులు నమోదు చేసి,వాటిని వె ల్ఫేర్ అసిస్టెంట్లకు అందజేసి,సంబంధిత యా ప్‌లో అప్లోడ్ చేయాలని ఎంపీడీవోలను ఆదే శించారు.ఈ టెలి కాన్ఫరెన్స్ లో వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి,జడ్పీ సీఈఓ నాసర రెడ్డి,డీఆర్డీఏ పీడీ రమణా రెడ్డి,మెప్మా పీడీ శ్రీనివాసులు,ఐసిడిఎస్ పీడీ విజయ,డీ ఈఓ సుధాకర్,డిప్యూటీ సీఈఓ,డీపీఓ,అన్ని మండలాల ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఏపీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సీఎంఎంలు,వయోజన విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment