బాపట్లలో విషాద ఘటన...పెళ్లి నిరాకరించడంతో తల్లి,కూతురు ఆత్మహత్య...

బాపట్లలో విషాద ఘటన 
పెళ్లి నిరాకరించడంతో తల్లి,కూతురు ఆత్మ హత్య
VS9TV న్యూస్,బాపట్ల :
నిశ్చితార్థం జరిగి పెళ్లి పీటలు ఎక్కాల్సిన కుటుం బంలో అనూహ్యంగా విషాదం చోటు చేసుకుంది. కాబోయే వరుడు నమ్మక ద్రోహం చేయడమే కా కుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడినట్లు ఆరో పణలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి-కూతురు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘ టన మార్టూరు మండలం పరిధిలోని ద్రోణాదుల గ్రామంలో చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉ న్నాయి...ఆ గ్రామానికి చెందిన సిరికొండ శ్రీని వాసరావు కుమార్తె దివ్య హైదరాబాద్ లో సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది.మంచి చదువులు పూర్తి చేసి ఉద్యోగం సాధించిన ఆమెకు కుటుంబ సభ్యులు మార్టూరుకు చెందిన మరో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రావులకొల్లు శేషుబాబుతో వివాహం నిశ్చయించారు.గత ఏడాది డిసెంబర్,14న ఇద్దరికీ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.ఈ వేసవిలో పెళ్లి జరగాల్సి ఉండగా అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి.ఈ నెల 4వ తేదీన పెళ్లి సంబంధం విషయమై మాట్లాడుకోవాలని చెప్పి శేషుబాబు..దివ్యను పిలిపించాడని కు టుంబ సభ్యులు చెబుతున్నారు.ఈ సందర్భంగా దివ్యను తాను రహస్యంగా అనుసరించి తీసిన కొన్ని ఫోటోలు,వీడియోలను చూపిస్తూ ఆమె ప్ర వర్తన సరిగా లేదంటూ నిందలు వేసినట్లు సమా చారం.అదే సమయంలో పెళ్లి చేసుకోనని స్పష్టం గా చెప్పడంతో దివ్య,ఆమె తల్లి తీవ్ర ఆవేదనకు గురయ్యారు.అదే రోజు తల్లి-కూతురు ఇద్దరూ ఎలుకల మందు,గడ్డి మందు సేవించినట్లు తెలు స్తోంది.ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న వారిని గమనించిన తండ్రి శ్రీనివాసరావు వెంటనే వారిని గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిం చారు.అసుపత్రిలో వైద్యులు వారిని కాపాడేందు కు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి విషమంగా మారింది.వారం రోజులుగా చికిత్స పొందుతున్న దివ్య గత గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచింది.ఆమె మరణం తర్వాత కొద్ది గంటలకే తల్లి సుజాత కూడా ప్రా ణాలు కోల్పోయింది.ఒకే కుటుంబంలో తల్లి- కూతురు ఇద్దరూ మరణించడంతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించా రు.నిశ్చితార్థం జరిగిన తర్వాత జరిగిన పరిణా మాలు,ఫోటోలు-వీడియోల అంశం,పెళ్లి రద్దు వెనుక ఉన్న కారణాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.అవసరమైతే సంబం ధిత వ్యక్తులను విచారించి నిజానిజాలు వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఇలా విషాదం చోటుచేసుకోవడం అంద రినీ కలచివేసింది.పోలీసులు దర్యాప్తు కొనసాగి స్తుండగా,ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివ రాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముం ది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...