నేడు లబ్ధిదారులకు ఉచిత కళ్లద్దాలు పంపిణి...నీలం సత్యనారాయణ,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థా పక అధ్యక్షులు...
నేడు లబ్ధిదారులకు ఉచిత కళ్లద్దాలు పంపిణి
నీలం సత్యనారాయణ,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు
కల్లూరు గ్రామం,ఆదిత్య పాఠశాలలో నేడు లబ్ధి దారులకు ఉచిత కంటి అద్దాలు పంపిణి కార్యక్రమం చేపడుతున్నట్లు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థా పక అధ్యక్షులు నీలం సత్య నారాయణ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కల్లూరులోని ఆదిత్య పాఠశాలలో 8వ తేదీ,ఆదివారం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం యు జెఎఫ్) గౌరవాధ్యక్షులు పి.యూసుఫ్ ఖా న్ అధ్య క్షతన మెగా ఉచిత వైద్య శిబిరం విజయ వంతంగా జరిగింది.ఈ కార్యక్రమం యునైటెడ్ జర్న లిస్ట్ ఫోరం (యుజెఎఫ్) జిల్లా కమిటీ,తెలకపల్లి నర సింహయ్య గ్రంధాలయం,కల్లూరు ఫోటో మరి యు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్,జర్నలిస్ట్ అసోసి యేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) జిల్లా కమిటీల సం యుక్త ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా గ్రంధాలయం మా జీ చైర్మన్ కె.జి.గంగాధర్ రెడ్డి,శ్రీ ఆదిత్య విద్యా నిల యం కరస్పాండెంట్ వాసుదేవయ్య,భారత చైతన్య యోజన పార్టీ రాష్ట్ర ఈసీ సభ్యులు వరుణ్ కుమార్ యాదవ్ ల సహకారంతో మెడికవర్,శాంతిరామ్,శ్రీ వెంకట సాయిరాయల్ డెంటల్ క్లినిక్ ల సౌజన్యంతో నిర్వహించారు.ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు కంటి చికిత్స లు నిర్వహించడమే కాకుండా ఉచితంగా కం టి అద్దాలు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చా రు.కావున హామీ మేరకు నేడు ఆదివారం ఉదయం 8-00గంటలకు కర్నూలు జిల్లా గ్రంధాలయం మాజీ చైర్మన్ కె.జి.గంగాధర్ రెడ్డి,శ్రీ ఆదిత్య విద్యా నిలయం కరస్పాండెంట్ వాసుదేవయ్యల చేతుల మీదుగా లబ్ధి దారులకు అందచేస్తారని ఆయన తెలిపారు.
Comments
Post a Comment