ఉరి అలా కాదు...ఇలా వేసుకోవాలి...భార్యకు సూచనలు చేస్తూ సెల్ ఫోన్ లో రికార్డు చేసిన భర్త...
ఉరి అలా కాదు...ఇలా వేసుకోవాలి
భార్యకు సూచనలు చేస్తూ సెల్ ఫోన్ లో రికార్డు చేసిన భర్త
భార్య భర్తల మధ్య కలహాలు ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేశాయి.భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడుతుంటే ఉరి అలా కాదు ఇలా వేసుకోవాలంటూ భార్యకు సూచనలు చేస్తూ ఆ ఘటనను భర్త సెల్ ఫోన్ లో రికార్డు చేసిన దారుణ ఘటన కడప జిల్లా రాజంపేటలో జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి...కడప జిల్లా,రాజంపేట మండలం,బోయినపల్లి గ్రామం లో నివాసం ఉంటూ రైల్వే లోకో పైలట్‌గా పని చేస్తున్న శ్రీరామ్ శ్రీనివాస్- అతని భార్య కృష్ణవేణి గురువారం గొడవ పడ్డట్టు తెలిసింది.అయితే ఈ గొడవలు వీరికి నిత్యమేనని స్థానికులు చెబుతు న్నారు.ప్రతిరోజు గొడవపడటం తర్వాత మా మూలుగా ఉండటం సర్వసాధారణమే అనుకు న్నారు స్థానికులు కూడా...అయితే ఈసారి విధి వికటించింది.ఉరి రూపంలో కృష్ణవేణిని మృత్యు వెంటాడింది.ఉరి వేసుకుంటానని భర్తతో గొడవ పడిన భార్య కృష్ణవేణి ఈసారి నిజంగానే ఉరి వేసుకుంది.అయితే ఆ ఉరి వేసుకునే సమయం లో భర్త శ్రీరామ్ శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నా డు.భార్య ఉరి వేసుకుంటుంటే కనీసం ఆమెను ఆపకపోగా...ఉరి అలా కాదు ఇలా వేసుకోవాలి అంటూ తనకు సూచనలు చేస్తూ వీడియో రికా ర్డు చేశాడు.సరాదాగా భావించి తన భార్యను కాపాడుకోలేకపోయాడా లేక కావాలని ఆమెను ఉరిని ప్రేరేపించాడా అనేదానిపై పోలీసులు విచా రణ చేస్తున్నారు...కృష్ణవేణి మృతిపై ఆమె బం ధువులు ఆగ్రహావేశాలకులోనై శ్రీరామ్‌పై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.అ యితే కృష్ణవేణి మృతికి ఆమె భర్తే కారణమని అ తని శిక్షించాలని వారు పట్టుబడ్డారు.దీంతో పోలీ సులు ఇతనిని అదుపులోకి తీసుకున్నట్లు సమా చారం. ఉరి వేసుకుంటుంటే కనీసం ఆపకపోగా చిత్రీకరించిన భర్త శ్రీరామ్ శ్రీనివాసులపై స్థాని కులు మండిపడుతున్నారురాజంపేటలో భార్య ఉరివేసుకుంటుండగా అక్కడే ఉన్న భర్త ఆపకపోగా ఎలా ఉరి వేసుకోవాలో సూచిస్తూ వీడియో తీయడం కలకలం రేపుతోంది.ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి భర్తను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Comments
Post a Comment