తుఫాన్ లో కూలిపోయిన మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి నివాస గృహం పునర్నిర్మించాలి...కమ్మరి పార్వతమ్మ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్...
తుఫాన్ లో కూలిపోయిన మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి నివాస గృహం పున ర్నిర్మించాలి
కమ్మరి పార్వతమ్మ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్
తాడేపల్లిలోని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని వారి స్వగృహం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభి వృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ శనివారం మర్యాద పూర్వకంగా కలిసి బ్రహ్మం గారి మఠం నందు గల శ్రీ మద్విరాట్ వీరబ్ర హ్మేంద్ర స్వామి వారి నివాస గృహం తుఫాను దాటికి కూలిపోయిన విషయం గురించి వారికి గుర్తు చేసి తక్షణమే పునర్నిర్మించాలని వినతిపత్రం అందచేశారు.అదే విధంగా శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి మాతా గోవింద మాంబల కల్యాణోత్సవం,స్వామి వారి ఆరాధనో త్సవాలు, శ్రీ మాత ఈశ్వరి దేవి ఆరాధ నోత్స వాలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొత్తపల్లి సత్యనారా యణ ఎం.డి ఫోరం ఫర్ డెమోక్రసీ ఏపీ కన్వీనర్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ యు వజన విభాగం ప్రధాన కార్యదర్శి కుప్పిలి నాగబా బు సుతారు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నా రు.
Comments
Post a Comment