జిల్లాలో తగినంత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల నిల్వ ఉంది...ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు...జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్...
జిల్లాలో తగినంత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల నిల్వ ఉంది
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు జిల్లాలో తగినంత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉన్నాయని,ప్రజలు ఎలాంటి ఆందోళన చెందా ల్సిన అవసరం లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ నూ రుల్ ఖమర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గ్యాస్ నిల్వలు సరిపడేంతగా సిద్ధంగా ఉన్నా యని తెలిపారు.ప్రస్తుతం జిల్లాలో సుమారు 11వేల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు నిల్వలో ఉన్నాయని,అద నంగా నేడు కూడా సుమారు ఏడు వేల సిలిండర్లు జిల్లాకు చేరుకున్నాయని తెలిపారు.ప్రతి రోజు సగ టున సుమారు 10వేల సిలిండర్లు వినియోగదారు లకు పంపిణీ జరుగుతోందని,ప్రస్తుతం ఉన్న డిమాం డ్‌కు సరిపడేంత సరఫరా కొనసాగుతోందని చెప్పా రు.అలాగే హాస్పిటల్స్,పాఠశాలలు,అంగన్వాడి కేంద్రాలు వంటి వాటికి అవసరమైన గ్యాస్ సరఫరా అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా చర్యలు తీసు కున్నామని పేర్కొన్నారు.అందువల్ల గ్యాస్ కొరతపై ఎటు వంటి అపోహలు వద్దని ప్రజలకు సూచించారు. ప్రజలు అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని,అవసరానికి తగి నంత బుకింగ్ చేసుకోవాలని సూచించారు.ఇక గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులకు ఎటువంటి ఇబ్బం దు లు కలిగించినా లేదా అధికంగా డిమాండ్ చేసినా కఠి నచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎక్కడై నా ఇబ్బందులు,అవకతవకలు జరిగినా వినియోగ దారులు 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవ చ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
Comments
Post a Comment